Doklam stand-off
-
భారత్ వ్యతిరేకత.. చైనా ఆశ్చర్యం
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం డోక్లాంలో భారత సైన్యం.. ఇండియా-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. అయితే భారత్ చర్యలకు చైనా ఆశ్చర్యపోయిందని.. ఇండియా తమను సవాలు చేయడం ఏంటని చైనా షాక్‌కు గురయ్యిందని ఆ దేశ నిపుణురాలు, అమెరికాలోని స్టిమ్సన్ సెంటర్లో ఈస్ట్ ఆసియా ప్రోగ్రాం సహ డైరెక్టర్ యున్ సన్ తెలిపారు. మన దేశానికి చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాక అప్పటి నుంచి చైనా వ్యూహాల్లో మార్పు వచ్చిందని.. భారత్‌తో పరస్పరం చర్చలు జరపడానికి ముందుకు రావడం దానిలో భాగమే అన్నారు యున్ సన్. భారత్, చైనా మధ్య 2017లో డోక్లాం ప్రతిష్టంభన గురించి యున్ సన్ మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం వివాదం చైనాని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే భారతదేశం తనను వ్యతిరేకిస్తుందని.. దాదాపు 72-73 రోజుల పాటు వివాదం నడుస్తుందని చైనా ఊహించలేదు. అది కూడా భూటాన్ సమీపంలోని బంజరు భూమి కోసం భారత్ తనను వ్యతిరేకిస్తుందని అస్సలు అనుకోలేదు. నిజంగా ఇది చైనాకు షాక్ లాంటిదే’ అన్నారు యున్ సన్. (నిషేధంతో చైనా గుబులు) వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట తూర్పు లడాఖ్‌లో కొనసాగుతున్న చైనా తాజా దురాక్రమణ గురించి యున్ సన్ను ప్రశ్నించగా.. ‘సరిహద్దు సమీపంలో భారతదేశం కార్యకలాపాలపై స్పందించాల్సిన అవసరం ఉందని చైనా అధికారులు భావించారు. దీని గురించి మీరు ఒక చైనా ప్రభుత్వ అధికారిని అడిగితే .. వారి సమాధానం ఎలా ఉంటుందంటే.. ‘వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారతదేశం చర్యలు మాకు అంగీకారం కావు. వాటిపై చైనా స్పందిస్తోంది’ అని సమాధానమిస్తారు’ అన్నారు యున్ సన్. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఎల్ఏసీ వెంబడి ఉన్న ప్రదేశాల గురించి ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతుందని తెలిపారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సై అంటే సై!) అంతేకాక ‘భారతదేశం తమ ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోందని చైనీయులు గుర్తించినప్పుడు ఎలా స్పందించాలి అనేది వారి ఇష్టం. భారతదేశం తమను వెన్నుపోటు పొడిచిందని చైనీయులు భావించారు. ప్రస్తుతం భారతదేశం చైనాను ఒక అసాధారణస్థితిలో పెడుతోంది. అలాంటప్పుడు చైనా దూకుడుగా స్పందించి భారతదేశంపై దాడి చేయాలి.. లేదా ఏమి చేయకుండా భూభాగాన్ని వదులుకోవాలి’ అని యున్ సన్ అన్నారు. -
భారత్‌కు చైనా వార్నింగ్
బీజింగ్, చైనా : డొక్లాం సమస్య నుంచి భారత్ పాఠాలు నేర్వాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) గురువారం హెచ్చరించింది. లేకపోతే భవిష్యత్‌లో డొక్లాం లాంటి సమస్యలు మరిన్ని చోటు చేసుకుంటాయని పేర్కొంది. గురువారం చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పై కామెంట్లు చేశారు. ఓ మీడియా ప్రతినిధి డొక్లాం సమస్యపై భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ కామెంట్ల గురించి క్వియన్ వద్ద ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన భారత్ డొక్లాం సమస్య నుంచి పాఠాలు నేర్చుకుంటుందని అనుకుంటున్నామని అన్నారు. లేకపోతే ఇలాంటి పరిస్థితులు(డొక్లాంలో భారతే అక్రమంగా ప్రవేశించిందని ఉద్దేశంతో) భవిష్యత్‌లో మరిన్ని తలెత్తుతాయని హెచ్చరించారు. -
డోక్లాం : చైనా కొత్త కుట్ర
-
డోక్లాం : చైనా కొత్త కుట్ర
న్యూఢిల్లీ : భారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా రెడీ అవుతోంది. డోక్లాం వివాదంతో అంతర్జాతీయ స్థాయిలో అవమాన పడ్డ చైనా.. వివాదాస్పద ప్రాంతంలోనే గుట్టుచప్పుడు కాకుండా సైనిక స్థావరాన్ని నిర్మించింది. అత్యంత పకడ్బందీగా నిర్మించిన ఈ సైనిక స్థావరం ఆనవాళ్లను శాటిలైట్లు గుర్తించాయి. భూటాన్ భూభాగంలోని డోక్లాం ప్రాంతం తమదే అంటూ చైనా కొంతకాలంగా వాదిస్తోంది. తాజాగా డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సైనిక స్థావరంతోపాట, రహదారులను, హెలీపాడ్, కందకాలను, గన్ పాయింట్లను చైనా నిర్మించింది. ఈ రహదారిలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తున్న ఆయుధ వాహనాలను శాటిలైట్ గుర్తించింది. ఇదిలావుండగా వివాదాస్పద భూభాగానికి కేవలం 400 మీటర్ల దూరంలో డ్రాగన్ కంట్రీ.. పలు సొరంగాలను, సైనికులకు బారక్స్‌ని నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. సిక్కింలోని డోక్లామ్ పోస్ట్‌కు కేవలం 81 మీటర్ల దూరంలో ఈ మిలటరీ కాంప్లెక్స్ ఉండడం గమనార్హం. -
డోక్లాంలో మళ్లీ రోడ్డేసిన చైనా
-
డోక్లాంలో మళ్లీ రోడ్డేసిన చైనా
న్యూఢిల్లీ: సిక్కింకు తూర్పు దిక్కున డోక్లాం ప్రాంతంలో చైనా తాజాగా రెండు రోడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయి. గతంలో సరిహద్దులోచైనా రోడ్డు నిర్మాణ పనులను భారత్ వ్యతిరేకించడంతో డోక్లాంలో ఇరు దేశాలు సైనికులను మోహరించడం తెలిసిందే. 70 రోజుల ప్రతిష్టంభన తర్వాత ఇరుదేశాలూ ఆ ప్రాంతంలో సైన్యాన్ని ఉపసంహరించాయి. ఆ తర్వాత కూడా చైనా 1, 1.2 కిలో మీటర్ల పొడవైన రెండు రోడ్లను సరిహద్దులో నిర్మించినట్లు, గతంలో సైనికులను మోహరించిన చోటుకు అవి వరసగా 4.5 కిలోమీటర్లు, 7.3 కి.మీ దూరంలో ఉన్నట్లు తాజాగా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. గత 13 నెలల కాలానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించగా, ఈ రెండు రోడ్లు అక్టోబర్ 17 నుంచి డిసెంబర్ 8 మధ్య నిర్మితమైనట్లు స్పష్టమవుతోంది. -
భారత్-భూటాన్ దోస్తీ.. చైనా ఏమంటోంది?
పొరుగు దేశాలైన భారత్-భూటాన్ మధ్య అనుబంధం రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో ఈ విషయమై చైనా ఆచితూచి స్పందించింది. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో భారత్‌కు అండగా నిలిచిన భూటాన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించడంపైనా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేసింది. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటే చూడాలని చైనా భావిస్తోందని పేర్కొంది. తాజాగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ భారత్ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ ఈ రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించేకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత్-భూటాన్ మధ్య సాధారణ సంబంధాలను మేం కోరుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో చైనాకు విరుద్ధంగా భారత్‌కు మద్దతునిచ్చినందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింత్ తనను కలిసిన భూటాన్ రాజు ఖేసర్ను ఎంతగానో ప్రశంసించారు. కోవింద్ ప్రశంసలపై స్పందిస్తూ.. ’ భారత సరిహద్దు బలగాల అతిక్రమణ ఘటనను మీరు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మా వైఖరేంటో ఎన్నోసార్లు తెలియజేశాం. దౌత్యమార్గాల్లో ఈ వివాదాన్ని భారత్-చైనా సముచితమైన రీతిలో పరిష్కరించుకున్నాయని మేం భావిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, భద్రతల కోసం చారిత్రక ఒప్పందాలకు కట్టుబడి భారత్, చైనాతో కలిసి పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం’అని ఆమె అన్నారు. -
డోక్లాం వివాదం పరిష్కారం వెనుక...
సాక్షి,న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే చైనాతో డోక్లాం వివాదాన్ని పరిష్కరించుకోగలిగిందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ విపణిలో భారత్ ప్రతిష్ట ఇనుమడించిందని అన్నారు. డోక్లాం ప్రతిష్టంభన వీడేందుకు భారత్ పరిణితితో వ్యవహరించిందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట పలుచనైతే డోక్లాం అంశం ఎన్నటికీ పరిష్కారమయ్యేది కాదని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రైజంక్షన్ వద్ద డోక్లాం ప్రాంతానికి సమీపంలో చైనా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. 71 రోజుల పాటు ఇండో,చైనా దళాలు సరిహద్దుల్లో మోహరించాయి. డోక్లాం వ్యవహరం సద్దుమణిగిన నేపథ్యంలో ఇతర వివాదాలనూ శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్,చైనా సంసిద్ధత వ్యక్తం చేశాయి. కాగా, అభివృద్ధి దిశగా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని భారత్‌లో చైనా రాయబారి పిలుపు ఇవ్వడం గమనార్హం. -
‘మోదీజీ...ఇప్పుడేమంటారు’
సాక్షి,న్యూఢిల్లీ: డోక్లాం వద్ద చైనా మళ్లీ రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై మోదీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో చైనా సైన్యం రోడ్డు నిర్మాణ పనులను పునరుద్ధరించిందనే వార్తల నేపథ్యంలో రాహుల్ స్పందించారు. చైనాతో వ్యూహాత్మకంగా వ్యవహరించి డోక్లాం వివాదాన్ని పరిష్కరించామంటూ ఛాతీ ఉప్పొంగించిన మోదీ ఇప్పుడేమంటారని రాహుల్ ట్వీట్ చేశారు.ఈ ఏడాది జూన్‌లో డోక్లాం సమీపంలోని ఇండో-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రోడ్డు నిర్మాణ పనులకు పూనుకోవడంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత సైన్యం సిక్కిం బోర్డర్ దాటి నిర్మాణ పనులను నిలిపివేయించారు. దాదాపు మూడు నెలల పాటు డోక్లాంపై ప్రతిష్టంభన కొనసాగింది. ట్రైజంక్షన్‌లో యథాతథ స్ధితిని చైనా ఉల్లంఘించిందని భారత్, భూటాన్ పేర్కొంటుండగా, అది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. -
డోక్లాం పరిష్కారం: తెర వెనుక ఉన్నదెవరు?
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన నేపథ్యంలో అనూహ్యంగా తెరపడింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వివాదం.. భారత్, చైనా, భూటాన్ ట్రైజంక్షన్ అయిన డోక్లాం కొండప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి భారత్-చైనా అంగీకరించడంతో శాంతియుతంగా పరిష్కారం అయింది. చైనా మీడియా, ఆ దేశ అధికారులు డోక్లాం వివాదంపై రోజుకో రెచ్చగొట్టే వ్యాఖ్య చేసినా.. భారత్ మాత్రం పరిణతితో హుందాగా రాజకీయ మౌనాన్ని పాటించింది. అవసరమైనప్పుడు మాత్రమే చైనా వాదనను తిప్పికొట్టింది. మరి, ఈ వివాదం సామసర్యంగా ముగియడంలో తెరవెనుక ఉన్నదెవరు అంటే.. అది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన బృందమే అని చెప్పాలి. మొండి వితండవాదం చేస్తున్న చైనాతో ధోవల్, ఆయన బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రత్యర్థికి గణనీయమైన నష్టాన్ని చేకూర్చగలమన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆత్మవిశ్వాసం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో దృఢవైఖరిని అవలంబిస్తూనే.. చైనాతో దౌత్య చర్చలను దోవల్ బృందం తెలివిగా ముందుకు తీసుకెళ్లింది. గత జూలై 27న బీజింగ్‌లో ధోవల్ చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచితో తొలిసారి భేటీ అయి దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 'ఇది మీ భూభాగమా?'అని యాంగ్ ప్రశ్నించగా.. ఈ ప్రశకు ఏమాత్రం తొణక్కుండా 'ప్రతి వివాదాస్పద ప్రాంతం చైనాకే చెందుతుందా?'అని దోవల్ దీటుగా ప్రశ్నించినట్టు సమాచారం. భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మించడం ద్వారా మూడు దేశాల ట్రైజంక్షన్‌లో చైనా స్టేటస్కో మార్చివేసిందని దోవల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా చారిత్రక ఒడంబడికలకు అనుగుణంగా భూటాన్ భద్రతను కాపాడాల్సిన భారత్‌కు ఉందని గుర్తుచేశారు. అయితే, డోక్లాంకు బదులుగా 500 చదరపు కిలోమీటర్ల భూటాన్ భూభాగాన్ని తిరిగి ఇస్తామని చైనా ఆఫర్ చేసినా భారత్ తిరస్కరించింది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్, చైనాలోని భారత రాయబారి విజయ్ గోఖలే, ఆర్మీ చీఫ్ రావత్, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అనిల్ భట్ తదితరులు చైనా బృందంతో చర్చలు జరిపినవారిలో ఉన్నారు. ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు చైనా అధ్యక్షుడు గ్జి జింపింగ్ ఈ దౌత్యచర్చలకు ఆమోదం తెలిపినప్పటికీ.. రాజకీయ మౌనాన్ని పాటించడంతో తెరవెనుక ఏం జరుగుతున్నది పెద్దగా తెలియలేదు. జీ20 సదస్సు సందర్భంగా హంబర్గ్‌లో భేటీ అయిన ఇద్దరు అధినేతలు డోక్లాం వివాదం మరింత ఉద్రిక్తతలు రాజేయకుండా ఉండేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే డోక్లాం వివాదం సత్వరంగా ముగిసేలా చూడాలని ప్రధాని మోదీ దోవల్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడం వల్ల ఎంతో లబ్ధ పొందుతాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో చైనా మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినా.. భారత్ మాత్రం సామరస్య పరిష్కారం కోసం ఒకింత మౌనాన్ని పాటించింది. -
డోక్లామ్ ఇష్యూ.. మా మద్ధతు భారత్‌కే...
న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులో డోక్లామ్ వద్ద ఇరు దేశాల సైన్యం మోహరించి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ ఆసియా దేశం భారత్ కు మద్ధతుగా వ్యాఖ్యలు చేసింది. యుద్ధంతో ఏ సమస్యా పరిష్కారం కాదంటూ చైనాకు చురకలు అంటిస్తూ జపాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. డోక్లామ్ వద్ద చైనా రోడ్డును నిర్మించటం అనేది ముమ్మాటికీ భారత్, భూటాన్లతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించటమేనని ఇండియాలో జపాన్ తరపున రాయబారి కెంజి హిరమట్సు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంలో పెద్దన్నగా అమెరికా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. డోక్లామ్ భూటాన్ భూభాగానికి చెందింది కాగా, రోడ్డు నిర్మాణం చేపట్టి భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తోంది. తద్వారా ఒకేసారి ఇరు దేశాలతో ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని కెంజి పేర్కొన్నారు. "డోక్లామ్ పరిస్థితులను జపాన్ నిశితంగా పరిశీలిస్తుంది. భూటాన్ తో ఉన్న ఒప్పందం కారణంగానే భారత్ ఈ వ్యవహారంలో కలుగజేసుకోవాల్సి వచ్చింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా చైనాతో దౌత్య సంబంధాలు దెబ్బ తినకుండా చర్చలు ముందుకు సాగేలా చూస్తామని పార్లమెంట్ సాక్షిగా తెలిపారు. శాంతియుతంగా ముందకు సాగాలన్న భారత్ నిర్ణయాన్ని జపాన్ స్వాగతిస్తోంది" అని కెంజి వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు మాకు బాగా కావాల్సినవే. సమస్య ఏదైనా శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ దౌత్య కార్యాలయ అధికారి హెతర్ నౌఎర్ట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
డోక్లామ్: ఆర్మీకి అర్జెంటుగా 20వేల కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆర్మీ ఆధునీకరణ, రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం అత్యవసరంగా రూ. 20వేలకోట్లను అదనంగా కేటాయించాలని రక్షణమంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సిక్కిం-భూటాన్, టిబేట్ ట్రైజంక్షన్‌లోని డోక్లామ్ కొండప్రాంతంలో భారత-చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ శాఖ నుంచి ఈ ప్రతిపాదన అందడం గమనార్హం. 2017-18 బడ్జెట్లో రక్షణశాఖకు అధిక ప్రాధాన్యమిచ్చి.. రూ. 2.74 లక్షల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులకు తోడు అదనంగా రూ. 20వేల కోట్ల అర్జెంటుగా కేటాయించాలంటూ రక్షణశాఖ.. కేంద్ర ఆర్థికశాఖను కోరింది. ఈ మేరకు రక్షణశాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా నేతృత్వంలోని అధికారుల బృందం ఆర్థికశాఖ అధికారులతో భేటీ అయింది. రక్షణశాఖ విన్నపాన్ని సాధ్యమైనంత త్వరగా పరిశీలిస్తామని ఆర్థికశాఖ తెలిపింది. రోజువారీ నిర్వహణ, జీతభత్యాల కోసం బడ్జెట్లో రూ. 1,72,774 కోట్లు కేటాయించగా, కొత్త ఆయుధాలు, ఆర్మీ ఆధునీకరణ కోసం రూ. 86,488 కోట్లను కేటాయించింది. అయితే, ఆయుధాల దిగుమతిపై సరికొత్త కస్టమ్స్ సుంకం విధించడంతో రక్షణశాఖ బడ్జెట్‌కు భారీ కన్నం పడింది. -
వెనక్కి వెళ్లండి లేదా చచ్చిపోతారు: చైనా
భారత్‌కు మూడు ఆప్షన్లు ఇచ్చిన చైనా మాజీ రాయబారి దాడి రాతలు కొనసాగిస్తున్న చైనా మీడియా 'వెనక్కివెళ్లండి. లేదా బంధీలుగా పట్టుబడండి. లేదంటే చనిపోతారు' ఇవి భారత్‌కు చైనా మాజీ రాయబారి ఇచ్చిన మూడు ఆప్షన్స్... సిక్కిం సరిహద్దుల్లో డొక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు చైనా మీడియా, అటు ఆ దేశం అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు చైనా మీడియా యుద్ధం తప్పదన్న రీతిలో రాతలు కొనసాగిస్తుండగా.. ఈ ప్రతిష్టంభనకు దౌత్యపరమైన పరిష్కారం లేనేలేదని, బేషరతుగా భారత్ తన బలగాలను డొక్లామ్ నుంచి ఉపసంహరించుకోవాల్సిందేనని డ్రాగన్ బుసలు కొడుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలో చైనా కౌన్సెల్ జనలర్‌గా పనిచేసిన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా చైనా తాజాగా సెంట్రల్ టెలివిజన్ ఇంగ్లిష్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరొక దేశం భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులు అవుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కొంటారు. ఒకటి స్వచ్ఛందంగా వెనుకకు తగ్గడం, లేదా పట్టుబడటం.. అప్పటికీ సరిహద్దు వివాదం సమసిపోకపోతే.. ఆ సైనికులు చంపపడొచ్చు' అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మూడు ఆప్షన్లలో భారత్ ఏది ఎంచుకుంటుందో చైనా వేచి చూస్తున్నదని, భారత్ అర్థవంతమైన సున్నితమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.