సాక్షి,న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే చైనాతో డోక్లాం వివాదాన్ని పరిష్కరించుకోగలిగిందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ విపణిలో భారత్ ప్రతిష్ట ఇనుమడించిందని అన్నారు. డోక్లాం ప్రతిష్టంభన వీడేందుకు భారత్ పరిణితితో వ్యవహరించిందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట పలుచనైతే డోక్లాం అంశం ఎన్నటికీ పరిష్కారమయ్యేది కాదని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.
సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రైజంక్షన్ వద్ద డోక్లాం ప్రాంతానికి సమీపంలో చైనా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. 71 రోజుల పాటు ఇండో,చైనా దళాలు సరిహద్దుల్లో మోహరించాయి. డోక్లాం వ్యవహరం సద్దుమణిగిన నేపథ్యంలో ఇతర వివాదాలనూ శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్,చైనా సంసిద్ధత వ్యక్తం చేశాయి. కాగా, అభివృద్ధి దిశగా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని భారత్‌లో చైనా రాయబారి పిలుపు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment