సాక్షి,న్యూఢిల్లీ: డోక్లాం వద్ద చైనా మళ్లీ రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై మోదీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో చైనా సైన్యం రోడ్డు నిర్మాణ పనులను పునరుద్ధరించిందనే వార్తల నేపథ్యంలో రాహుల్ స్పందించారు.
చైనాతో వ్యూహాత్మకంగా వ్యవహరించి డోక్లాం వివాదాన్ని పరిష్కరించామంటూ ఛాతీ ఉప్పొంగించిన మోదీ ఇప్పుడేమంటారని రాహుల్ ట్వీట్ చేశారు.ఈ ఏడాది జూన్‌లో డోక్లాం సమీపంలోని ఇండో-చైనా-భూటాన్ ట్రై జంక్షన్ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రోడ్డు నిర్మాణ పనులకు పూనుకోవడంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత సైన్యం సిక్కిం బోర్డర్ దాటి నిర్మాణ పనులను నిలిపివేయించారు.
దాదాపు మూడు నెలల పాటు డోక్లాంపై ప్రతిష్టంభన కొనసాగింది. ట్రైజంక్షన్‌లో యథాతథ స్ధితిని చైనా ఉల్లంఘించిందని భారత్, భూటాన్ పేర్కొంటుండగా, అది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment