
న్యూఢిల్లీ : భారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా రెడీ అవుతోంది. డోక్లాం వివాదంతో అంతర్జాతీయ స్థాయిలో అవమాన పడ్డ చైనా.. వివాదాస్పద ప్రాంతంలోనే గుట్టుచప్పుడు కాకుండా సైనిక స్థావరాన్ని నిర్మించింది. అత్యంత పకడ్బందీగా నిర్మించిన ఈ సైనిక స్థావరం ఆనవాళ్లను శాటిలైట్లు గుర్తించాయి.
భూటాన్ భూభాగంలోని డోక్లాం ప్రాంతం తమదే అంటూ చైనా కొంతకాలంగా వాదిస్తోంది. తాజాగా డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సైనిక స్థావరంతోపాట, రహదారులను, హెలీపాడ్, కందకాలను, గన్ పాయింట్లను చైనా నిర్మించింది. ఈ రహదారిలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తున్న ఆయుధ వాహనాలను శాటిలైట్ గుర్తించింది.
ఇదిలావుండగా వివాదాస్పద భూభాగానికి కేవలం 400 మీటర్ల దూరంలో డ్రాగన్ కంట్రీ.. పలు సొరంగాలను, సైనికులకు బారక్స్‌ని నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. సిక్కింలోని డోక్లామ్ పోస్ట్‌కు కేవలం 81 మీటర్ల దూరంలో ఈ మిలటరీ కాంప్లెక్స్ ఉండడం గమనార్హం.




Comments
Please login to add a commentAdd a comment