భారత్‌-భూటాన్‌ దోస్తీ.. చైనా ఏమంటోంది? | Want to see India, Bhutan developing normal relations, says China | Sakshi
Sakshi News home page

భారత్‌-భూటాన్‌ దోస్తీ.. చైనా ఏమంటోంది?

Published Thu, Nov 2 2017 3:19 PM | Last Updated on Thu, Nov 2 2017 3:19 PM

Want to see India, Bhutan developing normal relations, says China - Sakshi

పొరుగు దేశాలైన భారత్‌-భూటాన్‌ మధ్య అనుబంధం రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో ఈ విషయమై చైనా ఆచితూచి స్పందించింది. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో భారత్‌కు అండగా నిలిచిన భూటాన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించడంపైనా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేసింది. భారత్‌-భూటాన్‌ మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటే చూడాలని చైనా భావిస్తోందని పేర్కొంది. 

తాజాగా భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ వాంగ్‌చుక్‌ భారత్‌ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ ఈ రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించేకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత్‌-భూటాన్ మధ్య సాధారణ సంబంధాలను మేం కోరుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు. 

డోక్లాం ప్రతిష్టంభన విషయంలో చైనాకు విరుద్ధంగా భారత్‌కు మద్దతునిచ్చినందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింత్‌ తనను కలిసిన భూటాన్‌ రాజు ఖేసర్‌ను ఎంతగానో ప్రశంసించారు. కోవింద్‌ ప్రశంసలపై స్పందిస్తూ.. ’ భారత సరిహద్దు బలగాల అతిక్రమణ ఘటనను మీరు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మా వైఖరేంటో ఎన్నోసార్లు తెలియజేశాం. దౌత్యమార్గాల్లో ఈ వివాదాన్ని భారత్‌-చైనా సముచితమైన రీతిలో పరిష్కరించుకున్నాయని మేం భావిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, భద్రతల కోసం చారిత్రక ఒప్పందాలకు కట్టుబడి భారత్‌, చైనాతో కలిసి పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం’అని ఆమె అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement