Jigme Khesar Namgyel Wangchuck
-
ప్రధాని మోదీతో భూటాన్ రాజు భేటీ
న్యూఢిల్లీ: భారత్, భూటాన్లు తమ మధ్య భాగస్వామ్యాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. రెండు దేశాల మధ్య సహకారంలో ఇంధన రంగం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, టెక్నాలజీపై దృష్టి పెట్టాలని అంగీకారానికి వచ్చాయి. భారత్లో రెండు రోజుల పర్యటనకు గురువారం ఢిల్లీకి చేరుకున్న భూటాన్ రాజు జిగ్మే ఖెసర్ నంగ్యేల్ వాంగ్చుక్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించారు. థింపు ఆర్థిక ఉద్దీపన కార్యక్రమానికి తోడ్పాటునిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. -
మోదీకి భూటాన్లో అరుదైన గౌరవం
థింపూ: భూటాన్లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనకు శుక్రవారం ఉదయం భూటాన్ రాజధాని థింపూ చేరుకున్న మోదీకి ప్రధాని త్సెరింగ్ టొబ్గే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపూ దాకా 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి భారత్, టిబెట్ పతాకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోదీ స్వయంగా రాసిన పాటకు భారత సంప్రదాయ దుస్తుల్లో గర్బా నృత్యం చేశారు. దాన్ని మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. రాజు వాంగ్చుక్తో భేటీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్, ప్రధాని త్సెరింగ్లతో మోదీ సమావేశమయ్యారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను తొలిసారిగా మోదీకి రాజు ప్రదానం చేశారు. భారత్, భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోందని మోదీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఉంటుందన్నారు. ఈ సుందర దేశంలోకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగతం పలికిన భూటాన్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్, భూటాన్ మైత్రి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ‘మా పెద్దన్న మోదీ జీకి భూటాన్లోకి స్వాగతం’అని త్సెరింగ్ టొబ్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అనంతరం ప్రధానుల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై అధికార ప్రతినిధులు సంతకాలు చేశారు. రెండు దేశాల నడుమ కొక్రాఝర్– గెలెఫు, బనార్హట్–సంత్సెల మధ్య రైల్వే లైనుపై ఎంవోయూకు తుదిరూపం ఇచ్చారు. 21, 22వ తేదీల్లోనే మోదీ భూటాన్లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల ఒక రోజు వాయిదా పడింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. నేడు డిజొంగ్ మఠ సందర్శన భూటాన్లోని శక్తిమంతమైన తషిఛో డిజొంగ్ బౌద్ధ మఠాన్ని మోదీ శనివారం సందర్శించనున్నారు. థింపూలో భారత్ సహకారంతో ఏర్పాటైన అత్యాధునిక మాతా శిశు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. గత వారం భూటాన్ ప్రధాని త్సెరింగ్ భారత్లో ఐదు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో భూటాన్ రాజుకు ఘనస్వాగతం
న్యూఢిల్లీ: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్కు ఆదివారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ విమానాశ్రయంలో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. భారత్లో రాజు వాంగ్చుక్ ఎనిమిది రోజుల పర్యటన ఈ నెల 3న అస్సాం రాజధాని గువాహటిలో మొదలైంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. -
భారత్-భూటాన్ దోస్తీ.. చైనా ఏమంటోంది?
పొరుగు దేశాలైన భారత్-భూటాన్ మధ్య అనుబంధం రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో ఈ విషయమై చైనా ఆచితూచి స్పందించింది. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో భారత్కు అండగా నిలిచిన భూటాన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించడంపైనా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేసింది. భారత్-భూటాన్ మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటే చూడాలని చైనా భావిస్తోందని పేర్కొంది. తాజాగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్చుక్ భారత్ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ ఈ రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించేకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత్-భూటాన్ మధ్య సాధారణ సంబంధాలను మేం కోరుకుంటున్నాం’ అని ఆమె తెలిపారు. డోక్లాం ప్రతిష్టంభన విషయంలో చైనాకు విరుద్ధంగా భారత్కు మద్దతునిచ్చినందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింత్ తనను కలిసిన భూటాన్ రాజు ఖేసర్ను ఎంతగానో ప్రశంసించారు. కోవింద్ ప్రశంసలపై స్పందిస్తూ.. ’ భారత సరిహద్దు బలగాల అతిక్రమణ ఘటనను మీరు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మా వైఖరేంటో ఎన్నోసార్లు తెలియజేశాం. దౌత్యమార్గాల్లో ఈ వివాదాన్ని భారత్-చైనా సముచితమైన రీతిలో పరిష్కరించుకున్నాయని మేం భావిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, భద్రతల కోసం చారిత్రక ఒప్పందాలకు కట్టుబడి భారత్, చైనాతో కలిసి పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం’అని ఆమె అన్నారు. -
భూటాన్ బయలుదేరిన ప్రణబ్
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం భూటాన్ బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రణబ్కు వీడ్కోలు పలికారు. రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ సీనియర్ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు నలుగురు ఎంపీలు ప్రణబ్ వెంట భూటాన్ పయనమైనవారిలో ఉన్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్చుక్ ఆహ్వానంపై ప్రణబ్ ఆ దేశం వెళ్లారు. దాదాపు 26 ఏళ్లలో తొలిసారిగా ప్రణబ్ భూటన్లో పర్యటిస్తున్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటిగా భూటన్లో పర్యటించిన సంగతి తెలిసిందే.