
న్యూఢిల్లీ: భారత గగనతలంలోకి రెండు చైనా ఆర్మీ హెలికాప్టర్లు దూసుకువచ్చాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు లఢఖ్‌లోకి చైనా హెలికాప్టర్లు ప్రవేశించడంతో ఇందుకు స్పందనగా భారత వైమానిక దళం సుఖోయ్ జైట్లను గగనతలంలోకి పంపిందని మంగళవారం తెలిపారు. మే 5 మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. అయితే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగానే ఈ విధంగా జరిగిందని.. నిబంధనల ఉల్లంఘన జరుగలేదని స్పష్టం చేశారు. కాగా ఈ పరిణామాల అనంతరం ఇటీవల తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద భారత్- చైనా దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే .(ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత)
ఈ ఘటనలో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నట్లు వెల్లడించారు. తాజాగా భారత గగనతలంలోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment