
బయోకాన్ సింజిన్ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌కు చెందిన రీసెర్చ్ విభాగం సింజిన్ ఇంటర్నేషనల్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సింజిన్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తన మర్చంట్ బ్యాంకర్ యాక్సిస్ క్యాపిటల్ ద్వారా సెబీకి సమర్పించింది. సెబీ ఈ నెల 12న సింజిన్ ఇంటర్నేషనల్ ఐపీఓకు ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదా పత్రాల ప్రకారం..., సింజిన్ ఇం టర్నేషనల్ 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఈ ఐపీఓ ద్వారా ఎంత మొత్తం సమీకరించాలనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోందని పరిశ్రమ వర్గాల అంచనా.