న్యూఢిల్లీ: బయోటెక్ దిగ్గజం బయోకాన్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 105 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 92 కోట్లతో పోలిస్తే ఇది 14.5% అధికం. ఇదే కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అమ్మకాలు కూడా రూ. 634 కోట్ల నుంచి రూ. 701 కోట్లకు పెరిగాయి. కంపెనీ చైర్మన్ కిరణ్ మజుందార్ ఫలితాలపై స్పందిస్తూ రీసెర్చ్‌కు సంబంధించి క్యూ3లో పలు మైలురాళ్లను చేరుకున్నామన్నారు. ట్రాస్టుజుమబ్‌కు డీసీజీఐ అనుమతి లభించడాన్ని ప్రస్తావించారు. దీంతో దేశీయంగా వాణిజ్య ప్రాతిపదికన కాన్‌మాబ్ ఔషధాన్ని విడుదల చేసేందుకు వీలు కలగనున్నట్లు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు దాదాపు 6% పతనమై రూ. 452 వద్ద ముగిసింది.
బయోకాన్ లాభం రూ. 105 కోట్లు
Published Fri, Jan 24 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement