Kiran Mazumdar
-
Yamini Mazumdar: ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం చేస్తూ..
Kiran Mazumdar Mother Yamini Mazumdar Inspirational Journey In Telugu: యామినీ మజుందార్... ఈ పేరు మనకు పరిచయం లేదు. కానీ ఎప్పుడో విన్న పేరే అనిపిస్తుంది. నిజమే... బయోకాన్ ఫౌండర్, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తల్లి యామినీ ముజుందార్. ఆమె జీవితంలో ఎక్కువ కాలం గృహిణిగానే గడిచిపోయింది. ఎంట్రప్రెన్యూర్‌గా మారాల్సిన అత్యయిక పరిస్థితిని కల్పించింది జీవితం. అది కూడా 58 ఏళ్ల వయసులో. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వయసులో కెరీర్ నిర్మాణం చేసుకున్నారామె. భర్త మరణం తర్వాత తనకంటూ ఒక ఉపాధి మార్గాన్ని ఏర్పరుచుకోవాల్సిన అవసరం అది. పెద్దగా చదువుకున్నది లేదు. కొత్తగా ఏదైనా చేయాలంటే నేర్చుకునే సమయం కూడా ఇవ్వలేదు జీవితం. ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం పెట్టారామె. అదే జీవ్స్ డ్రై క్లీనింగ్ సర్వీస్. పన్నెండు గంటల పని లాండ్రీ బిజినెస్ పెట్టీ పెట్టగానే అంతా సవ్యంగా ఏమీ జరగలేదు. అలాగని ఆమె వెనుకడుగు వేయలేదు. ఆమె లాండ్రీ పెట్టిన 1990లో మనదేశంలో అందుబాటులో లేని హై ఎండ్ ఎక్విప్మెంట్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఐదుగురు ఉద్యోగులతో పని చేయించుకుంటూ ఆమె రోజుకు పన్నెండు గంటలు పనిలోనే ఉండేవారు. అలా ఓ దశాబ్దం పాటు పడిన శ్రమతో అప్పుల నుంచి బయటపడ్డారామె. ‘‘పని లేకుండా నిరుపయోగంగా రోజును గడపడం నాకు నచ్చదు. వయసు ఒక నంబర్ మాత్రమే. పని చేయాలనే సంకల్పం ఉంటే వయసు లెక్క కానే కాదు. ఇప్పటికీ రోజుకు నాలుగు గంటల సేపు లాండ్రీ యూనిట్లో ఉంటాను. నలభై మంది ఉద్యోగులు పని చేస్తున్నారిప్పుడు. కోవిడ్ సమయంలో పనులు ఆపేశాం. ఇప్పుడు అంతా గాడిలో పడినట్లే. అన్నీ యథావిథిగా జరుగుతున్నాయి’’ అంటారు యామినీ మజుందార్. కోవిడ్ కారణంగా యూనిట్ తాత్కాలికంగా పని లేకుండా మూతపడిన సమయంలో కూడా ఉద్యోగులందరికీ జీతంలో ఏ మాత్రం కోత లేకుండా పూర్తి వేతనాన్ని ఇచ్చారామె. చైతన్యమే ఆమె శక్తి యామినీ మజుందార్‌కి ఇప్పుడు తొంభై ఏళ్లు. రోజూ న్యూస్ చూస్తారు. క్రికెట్ మ్యాచ్ వస్తుంటే టీవీ ముందు నుంచి కదలరు. ‘నేను టీవీ చూడాల్సిన పని లేదు. మ్యాచ్‌లో స్కోర్ నుంచి వార్తల వరకు గంటగంట కూ అప్డేట్ ఇస్తుంటుంది అమ్మ’ అని చెబుతారు కిరణ్ మజుందార్ షా. యామినీ మజుందార్ ఎంత చురుగ్గా, చైతన్యవంతంగా జీవిస్తున్నారో చెప్పే మరో సంఘటన మూడేళ్ల కిందట చోటు చేసుకుంది. అది 2018 మే నెల 12వ తేదీ. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల రోజు. యామిని పోలింగ్ బూత్ కెళ్లి వోటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకు గుర్తును చూపిస్తూ ‘వోటు వేయడం నా హక్కు. నా హక్కును వినియోగించుకున్నాను. అది పౌరులుగా మన బాధ్యత. మనం వోటు వేయకపోతే ఇక ప్రజాస్వామ్యానికి, ఎన్నికలకు అర్థం ఏముంటుంది?’ అని వోటు హక్కు వినియోగం గురించిన సందేశం ఇచ్చారు. చదవండి: How To Secure Digital Payment Transactions: రెస్టారెంట్‌కు వెళ్లిన గీతకు షాకిచ్చిన వెయిటర్.. ఏకంగా.. The most precious word in the world is MA. It stands for unlimited love and selflessness. Like me, everyone who loves their mother must support @mafoundationindia and encourage their followers, family & friends to do the same. Click to donate: https://t.co/ryYXsGrTnJ pic.twitter.com/bXUQtHtCAH — Kiran Mazumdar-Shaw (@kiranshaw) November 29, 2021 -
ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేకుండా పోయిందంటూ వ్యాపార దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తమ సొంత అభిప్రాయాలను అందరికీ ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు .. జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాల సమక్షంలోనే రాహుల్ బజాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎవరూ దేని గురించీ భయపడాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితులేమైనా ఉంటే చక్కదిద్దేందుకు కృషి చేస్తామని షా స్పందించారు. ఈ చర్చాగోష్టి క్లిప్పింగ్‌ను మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో పోస్ట్ చేసిన నిర్మలా సీతారామన్.. అన్ని సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటోందని, పరిష్కరించే ప్రయత్నాలూ చేస్తోందని చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బజాజ్‌కు ‘బయోకాన్’ షా మద్దతు .. మరోవైపు, రాహుల్ బజాజ్‌కు మద్దతుగా మరో పారిశ్రామిక దిగ్గజం బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా స్పందించారు. కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం అంటరానివాటిగా చూస్తోందని, ఎకానమీ గురించి ఏ విమర్శలనూ వినదల్చుకోవడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. అటు నిర్మలా సీతారామన్ ట్విట్టర్ పోస్ట్‌లపైనా షా స్పందించారు. కార్పొరేట్ సంస్థలు.. దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ‘మేడమ్ మేం జాతి వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక శక్తులం కాము. ఎకానమీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయ వంతం కావాలనే మేమూ కోరుకుంటున్నాం‘ అని ఆమె ట్వీట్ చేశారు. ఇక, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై విమర్శలకు దిగాయి. ‘విమర్శించడమనేది జాతి ప్రయోజనాలకు ముప్పు అంటే.. ప్రభుత్వాన్ని పొగిడితేనే దేశ ప్రయోజనాలను కాపాడినట్లవుతుందా’ అంటూ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు. 5 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. న్యూఢిల్లీ: కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం వల్ల పన్ను వసూళ్లపై ప్రతికూల ప్రభావమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ దాకా స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 5 శాతం పెరిగాయని ఆమె తెలిపారు. ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా.. ప్రత్యక్ష పన్ను వసూళ్లేమీ తగ్గలేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఆఖరు త్రైమాసికంలోనే అత్యధికంగా ఉంటాయని ఆమె చెప్పారు. -
సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి
న్యూఢిల్లీ: కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మృతిపై పారిశ్రామిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. ‘సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను‘ అని కిరణ్ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపార వైఫల్యాలతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు కుంగిపోరాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘సిద్ధార్థ స్ఫూర్తిదాయకమైన ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టరు‘ అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకి నిదర్శనం: మాల్యా సిద్ధార్థ మరణంపై దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రుణాలన్నీ తిరిగి పూర్తిగా కట్టేస్తానంటున్నా తనను కూడా అలాగే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగవేసిన ఆర్థిక నేరస్థుడన్న ఆరోపణలతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘నాకు వీజీ సిద్ధార్థతో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలోని అంశాలు ఎంతో కలిచివేసేవిగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దయనీయ స్థితిలోకి నెట్టేయగలవు. నేను పూర్తిగా డబ్బు కట్టేస్తానంటున్నా ఎలా వేధిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. మిగతా దేశాల్లో రుణగ్రహీతలు ఏదో రకంగా రుణాలు కట్టేసేలా ప్రభుత్వం, బ్యాంకులు సహాయం అందిస్తాయి. కానీ నా కేసు విషయంలో నేను కట్టేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటున్నారు‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్లు.. సిద్ధార్థకు చెందిన కాఫీ డే నేచురల్ రిసోర్సెస్, టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్ల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 149 కోట్లు, టాంగ్లిన్‌లో రూ. 44 కోట్ల మేర ఉన్నట్లు మార్నింగ్‌స్టార్ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. డీఎస్పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ అత్యధికంగా కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో రూ. 132 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరో 20 శాతం పడిన షేరు.. తాజా పరిణామాలతో బుధవారం కూడా కాఫీ డే షేరు మరో 20 శాతం పతనమైంది. ఇంట్రాడేలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 123.25కి క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కూడా. అటు ఎన్ఎస్ఈలో కూడా 20% పతనమై రూ. 122.75కి పడింది. రెండు రోజుల్లో సంస్థ మార్కెట్ విలువ రూ. 1,463 కోట్లు ఆవిరైపోయి.. రూ.2,604 కోట్లకు తగ్గింది. సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్తలతో మంగళవారం కూడా కాఫీ డే షేరు 20% పతనమైన సంగతి తెలిసిందే. -
బయోకాన్ లాభం రూ. 105 కోట్లు
న్యూఢిల్లీ: బయోటెక్ దిగ్గజం బయోకాన్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 105 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 92 కోట్లతో పోలిస్తే ఇది 14.5% అధికం. ఇదే కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అమ్మకాలు కూడా రూ. 634 కోట్ల నుంచి రూ. 701 కోట్లకు పెరిగాయి. కంపెనీ చైర్మన్ కిరణ్ మజుందార్ ఫలితాలపై స్పందిస్తూ రీసెర్చ్‌కు సంబంధించి క్యూ3లో పలు మైలురాళ్లను చేరుకున్నామన్నారు. ట్రాస్టుజుమబ్కు డీసీజీఐ అనుమతి లభించడాన్ని ప్రస్తావించారు. దీంతో దేశీయంగా వాణిజ్య ప్రాతిపదికన కాన్‌మాబ్ ఔషధాన్ని విడుదల చేసేందుకు వీలు కలగనున్నట్లు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు దాదాపు 6% పతనమై రూ. 452 వద్ద ముగిసింది.