ముంబై: దేశీ ఫార్మా దిగ్గజం బయోకాన్ తాజాగా వాటాదారులకు డివిడెండ్ చెల్లించే యోచనలో ఉంది. దీంతో ఇవాల్టిమార్కెట్లో బయోకాన్ కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బయోకాన్ షేరు భారీగా లాభపడింది. 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. 8.45శాతానికిపైగా దూసుకెళ్లి రూ. 1,155వద్ద పాజిటివ్‌గా ఉంది.
బయోకాన్ తన వాటాదారులకు బోనస్ జారీ చెల్లించనున్నామని మంగళవారం ప్రకటించింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల స 27న సమావేశంకానున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు.
ఇతర ఫార్మా షేర్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి లుపిన్, సన్‌ఫార్మా,డా.రెడ్డీస్, క్యాడిల్లా హెల్త్‌కేర్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.