న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ వాటాదారులకు తాజాగా బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఈ నెల 16–17న నిర్వహించనున్న సమావేశంలో కంపెనీ బోర్డు బోనస్ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలను 17న విడుదల చేయనుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 3,003 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం క్షీణించి రూ. 21,964 కోట్లకు పరిమితమైంది. వారాంతాన బీఎస్‌ఈలో విప్రో షేరు 0.8 శాతం బలపడి రూ. 529 వద్ద ముగిసింది.
ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?
Comments
Please login to add a commentAdd a comment