బయోకాన్‌ ప్రమోటర్‌కు విదేశీ అవార్డు | Shaw named EY World Entrepreneur Of The Year 2020 | Sakshi
Sakshi News home page

బయోకాన్‌ ప్రమోటర్‌కు విదేశీ అవార్డు

Published Fri, Jun 5 2020 11:05 AM | Last Updated on Fri, Jun 5 2020 1:14 PM

Shaw named EY World Entrepreneur Of The Year 2020 - Sakshi

బయోకాన్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. అందుబాటు ధరల్లో మెడిసిన్స్‌ అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నందుకు గాను ఈవై వరల్డ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2020గా ఆమె నిలిచారు. వర్చువల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌  అవార్డు కార్యక్రమంలో ఆమెను ఈ అవార్డుతో సత్కరించారు. 41 దేశాల నుంచి 46 మంది ఎంటర్‌ప్రెన్యూర్‌లు పోటీపడగా కిరణ్‌ మజుందార్‌ మొదటి స్థానంలో నిలిచి వరల్డ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా నిలిచారు. కాగా ఈ అవార్డును అందుకున్న భారతీయులలో కిరణ్‌ మూడో వ్యక్తి. 2015లో ఇన్ఫోసిస్‌  నారాయణమూర్తి, 2014లో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అధినేత ఉదయ్‌ కోటక్‌లు వరల్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ అవార్డు గెలుచుకున్న మహిళలల్లో కిరణ్‌ రెండో మహిళా సీఈఓ. గత 30 ఏళ్లుగా బయోకాన్‌ వృద్ధిని సుస్థిరంగా కొనసాగిస్తూ వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్రవేసిన కిరణ్‌.. అవార్డు ప్యానెల్‌ జడ్జీల మనసు గెలుచుకోవడంతో ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఈవై నిర్వాహాకులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement