
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)లోని న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజొనెన్స్ (ఎన్‌ఎంఆర్) కేంద్రం... అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తనిఖీలను విజయవంతంగా అధిగమించింది. ఈ మేరకు ఐఐసీటీ మంగళవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా మందులతోపాటు రసాయనాల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఈ న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కొపీని ఉపయోగిస్తారన్నది తెలిసిందే.
యూఎస్ ఎఫ్‌డీఏ ఈ కేంద్రాన్ని ఆగస్టు 21, 22 తేదీల్లో తనిఖీ చేసిందని, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్లు గుర్తించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఈ కేంద్రానికి నో యాక్షన్ ఇనిషియేటెడ్ (ఎన్‌ఏఐ) వర్గీకరణను కేటాయించింది. ‘‘దేశంలో ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ ఉన్న అతిపెద్ద ఎన్‌ఎంఆర్ వ్యవస్థల్లో ఐఐసీటీ ఒకటి. ఇందులో అత్యాధునిక హైఫీల్డ్ ఎన్‌ఎంఆర్ స్పెక్ట్రోమీటర్లను ఏర్పాటు చేశాం. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో ఇక్కడ నాణ్యమైన క్వాలిటీ అనలిటికల్స్, ఏపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment