ముంబై: దేశీయ ఫార్మా దిగ్గంజ లుపిన్ లిమిటెడ్ సోమవారం నాటి మార్కెట్లో భారీగా లాభపడుతోంది. గోవా ప్లాంటు తనిఖీల్లో సంస్థకు అమెరికా యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి క్లీన్ చిట్ లభించడంతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. గతజులై 7 తరువాత భారీగా లాభపడి గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది ఫార్మా కౌంటర్ 6 శాతం బలహీనపడగా లుపిన్ మాత్రం 23 శాతం ఎగిసింది. మరోవైపు ఈఐఆర్ నుంచి తమకు ఆమోదం లభించిందన్న సంస్థ ప్రకనటతో గత శుక్రవారం11 శాతం క్షీణించిన లుపిన్ కు నేడు సెంటిమెంట్ బలంగా ఉంది.
ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో గోవా యూనిట్ కు (ఈఐఆర్) యూఎస్‌ఎఫ్‌డీఏ క్లియరెన్స్ ల భించడంతో కౌంటర్‌కు భారీ డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం 8 శాతానికిపైగా లాభాలతో మార్కెట్లో టాప్ విన్నర్ గా ట్రేడవుతోంది.
కాగా లుపిన్.. గుండెజబ్బులు, డయాబెటిస్, ఆస్త్మా వంటి పలువ్యాధుల చికిత్సలో జనరిక్ ఫార్ములేషన్లు, బయోటెక్నాలజీ ఔషధాలను తయారీలో పేరుగడించిన సంగతి తెలిసిందే.
లుపిన్కు యూఎస్‌ఎఫ్‌డీఏ క్లియరెన్స్
Published Mon, Nov 7 2016 11:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
Advertisement
Advertisement