
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే డబుల్ సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ 33వేలకు పైన పటిష్టంగా కదులుతోంది. అటు నిఫ్టీ 68 పాయింట్లు ఎగిసి 10,192 వద్ద ట్రేడవుతోంది. కొత్త చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడ్ కమిటీ కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశంఉందని భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రియల్టీ షేర్లలో ఒబెరాయ్, యూనిటెక్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్, శోభా, డీఎల్‌ఎఫ్ భారీగా లాభపడుతున్నాయి. వీటితోపాటు బ్యాంక్స్, మెటల్, ఫార్మా లాభపడుతున్నాయి. ఐబీ హౌసింగ్, ఎస్‌బీఐ, వేదాంతా, ఓఎన్‌జీసీ, యాక్సిస్, యస్‌బ్యాంక్, సన్ ఫార్మా, బీపీసీఎల్, టాటా స్టీల్, ఆర్‌ఐఎల్ లాభాల్లోనూ, హెచ్‌యూఎల్, ఐషర్, జీ, టెక్ మహీంద్రా, హీరోమోటో స్వల్ప నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అలాగే డీమార్ట్ లాంటి రీటైల్ షేర్లు జోరుగా ట్రేడ్ అవుతున్నాయి.