
సాక్షి, ముంబై: గతరెండు సెషన్లుగా తీవ్ర ఊగిసలాటల మధ్య కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్ ఏకంగా నాలుగు వందల పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ సైతం సెంచరీ లాభాలతో 10400 స్థాయిని దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 420 పాయింట్లు ఎగిసి 34,724వద్ద నిఫ్టీ సైతం 140 పాయింట్లు జంప్‌చేసి 10,441 వద్ద ట్రేడవుతోంది.
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ తప్ప దాదాపు అన్ని రంగాల్లోనూ లాభాలే. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటన్, మారుతీ, ఐషర్, వేదాంతా, జీ, యాక్సిస్, బజాజ్ ఆటో, యూపీఎల్ భారీగా లాభపడుతుండగా హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, విప్రో, హెచ్‌యూఎల్ నష్టపోతున్నాయి.
మరోవైపు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్‌గా ఉంది.