ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నస్పూర్(ఆదిలాబాద్): పట్టణంలోని ఓ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్ పార్టీ మారడానికి బేరసారాలు సాగించిన ఆడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో రూ.15లక్షలు ఖర్చు చేశానని, మీ సార్‌తో మాట్లాడి ఇప్పిస్తే పార్టీలోకి వస్తానంటూ చెప్పగా.. సార్‌ను అడిగి చెబుతానంటూ ఫోన్‌లో ఇద్దరు మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫోన్‌లో మాట్లాడుకున్నది ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్.. ఏ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్‌తో మాట్లాడాడు అనే విషయమై పట్టణ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
వ్యాక్సిన్ వేయకుండానే...వేసినట్లు
మంచిర్యాలటౌన్: జిల్లాలో పలువురికి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయకుండానే వేసినట్లు సెల్‌కు మెస్సేజ్‌లు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లికి చెందిన మునిమంద తిరుమల అనే మహిళ గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన కోవిషీల్డ్ మొదటిడోసును బెల్లంపల్లిలోని శంషీర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వేసుకుంది. గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ మధ్య రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సెల్‌కు మెస్సేజ్ వచ్చింది.
అనారోగ్యంగా ఉండడంతో గడువులోగా వేసుకుందామని అనుకోగా గత నెల 29వ తేదీ వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా సెల్‌కు మెసేజ్ 30వ తేదీన వచ్చింది. దీంతో ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే వ్యాక్సిన్ రెండో డోసు పూర్తయినట్లు వ్యాక్సినేషన్ సర్టిపికేట్ రావడంతో ఖంగుతింది. ఇదే విషయమై జిల్లా వ్యాక్సినేషన్ ఇన్‌చార్జి డాక్టర్ ఫయాజ్‌ఖాన్‌ను వివరణ కోరగా ఒకే సెల్ నంబరుతో నలుగురు వరకు వ్యాక్సిన్‌ను వేసుకుంటున్నారని, సాంకేతిక కారణాలతో అలా వచ్చి ఉంటుందని, లబ్ధిదారులకు రెండో డోసు తప్పనిసరిగా వేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment