
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూన్‌లో 12.83 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. జూన్‌లో కరోనా వైరస్ నెమ్మదించడం ఉద్యోగ కల్పనకు దారితీసినట్టు పేర్కొంది.
ఈ ఏడాది మే నెలలో నికర సభ్యుల నమోదుతో పోలిస్తే జూన్‌లో 5.09 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌లో 12.83 లక్షల మంది కొత్త సభ్యుల్లో 8.11 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చినవారే. అంటే మొదటిసారి ఉపాధి పొందినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment