న్యూఢిల్లీ: మార్చి నెలలో జియో, ఎయిర్‌టెల్ కొత్త చందాదారులను సొంతం చేసుకున్నాయి. ఎయిర్‌టెల్ నికరంగా 22.55 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంది. జియో కొత్త కస్టమర్లు 12.6 లక్షలుగా ఉన్నారు. వొడాఫోన్ ఐడియా 28.18 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. బీఎస్‌ఎన్‌ఎల్ 1.27 లక్షల మంది చందాదారులను నష్టపోయింది.
మార్చి చివరికి టెలికం చందాదారుల సంఖ్య 116.69 కోట్లకు చేరింది. ఇందులో వైర్‌లెస్ (మొబైల్) చందాదారులు 114.2 కోట్లుగా ఉన్నారు. ఈ గణాంకాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) విడుదల చేసింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారులు ఫిబ్రవరి చివరికి 2.45 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 2.48 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ విభాగంలో జియో 2.87 లక్షల కొత్త కస్టమర్లను రాబట్టుకుంది.
చదవండి: ప్యూర్‌గా కాలిపోతున్నాయ్.. హైదరాబాద్‌లో దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్
Comments
Please login to add a commentAdd a comment