Tesla CEO Elon Musk Satirical Comments on Netflix - Sakshi
Sakshi News home page

Netflix: నెట్‌ఫ్లిక్స్‌పై ఎలన్‌మస్క్‌ పంచులు!

Published Wed, Apr 20 2022 12:39 PM | Last Updated on Wed, Apr 20 2022 2:50 PM

Elon Musk Satires On Netflix - Sakshi

నిన్నామొన్నటి వరకు ట్విటర్‌పై వరుసగా పంచులు వేస్తూ పోయిన ఎలన్‌మస్క్‌ ఇప్పుడు తన దృష్టి నెట్‌ఫ్లిక్స్‌ మీదకు మరల్చాడు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వరుసగా చందాదారులను కోల్పోతోంది. గతేడాది నుంచి ఈ ట్రెండ్‌ మొదలవగా ప్రస్తుత త్రైమాసికంలోనూ కొనసాగింది. దీంతో చందాదారులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై నెట్‌ఫ్లిక్స్‌ తర్జనభర్జనలు పడుతోంది.

మరోవైపు చందాదారులను భారీగా కోల్పోతుండటంతో షేర్‌ ధర కూడా భారీగా పడిపోతుంది. ఈ అంశాలపై ‍శ్లాష్‌డాట్‌ సంస్థ ఓ కథనం ప్రచురించి ట్వీట్‌ చేసింది. దీనిపై ఎలన్‌మస్క్‌ స్పందిస్తూ జ్ఞానం అనే వైరస్‌ సోకవడంతో నెట్‌ఫ్లిక్స్‌ చందాదారుల సంఖ్య పడిపోతుంది ( ది వోక్‌ మైండ్‌ వైరస్‌ ఈజ్‌ మేకింగ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అన్‌వాచబుల్‌)  పంచ్‌ విసిరారు. మస్క్‌ విసిరిన పంచ్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. 

చదవండి: Elon Musk: ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు.. ఫ్రెండ్స్‌ ఇళ్లలోనే ఉంటా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement