
న్యూఢిల్లీ: పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహణలోని పింఛను పథకాల్లో సభ్యుల సంఖ్య ఏప్రిల్ చివరికి 5.23 కోట్లకు చేరింది. 2021 ఏప్రిల్ నాటికి ఉన్న సభ్యులు 4.26 కోట్ల మందితో పోల్చి చూస్తే ఏడాది కాలంలో 23 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలను పీఎఫ్‌ఆర్‌డీఏ చూస్తోంది. ఎన్‌పీఎస్, ఏపీవై కింద సభ్యులకు చెందిన పింఛను ఆస్తుల విలువ రూ.7,38,765 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఉన్న విలువ నుంచి 25 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment