దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో సుమారు 10 కోట్ల మంది సబ్‌్రస్కయిబర్స్ ఈ సరీ్వసులను వినియోగించుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు.
టెలికం సంస్థలు 2022లో వేలంలో కొనుక్కున్న స్పెక్ట్రం కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచి్చంచడంతో పాటు మొత్తం మీద రూ. 2 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్‌లోనే 5జీ సేవలు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, లిక్విడిటీని మెరుగుపర్చేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చేపట్టిన సంస్కరణలు టెలికం రంగ వృద్ధికి తోడ్పడ్డాయని చౌహాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment