Communication Ministry
-
10 కోట్ల మంది 5జీ యూజర్లు..
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో సుమారు 10 కోట్ల మంది సబ్‌్రస్కయిబర్స్ ఈ సరీ్వసులను వినియోగించుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. టెలికం సంస్థలు 2022లో వేలంలో కొనుక్కున్న స్పెక్ట్రం కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచి్చంచడంతో పాటు మొత్తం మీద రూ. 2 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్‌లోనే 5జీ సేవలు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, లిక్విడిటీని మెరుగుపర్చేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చేపట్టిన సంస్కరణలు టెలికం రంగ వృద్ధికి తోడ్పడ్డాయని చౌహాన్ చెప్పారు. -
కొత్త టెలికం బిల్లు 10 నెలల్లో అమల్లోకి..
న్యూఢిల్లీ: దాదాపు 137 ఏళ్ల పాత ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ స్థానంలో కొత్త టెలికం బిల్లు 6–10 నెలల్లో అమల్లోకి రాగలదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే, దీనిపై ప్రభుత్వమేమీ తొందరపడటం లేదని పేర్కొన్నారు. ‘చర్చల ప్రక్రియ బట్టి తుది ముసాయిదా రూపొందుతుంది. ఆ తర్వాత అది వివిధ ప్రక్రియలు పూర్తి చేసుకుని పార్లమెంటు ముందుకు వెడుతుంది. ఇందుకోసం 6–10 నెలల పట్టొచ్చు. మేము ఏమీ తొందరపడటం లేదు‘ అని వైష్ణవ్ చెప్పారు. కొత్త టెలికం బిల్లు గానీ ఆమోదం పొందితే ఇంటర్నెట్ కాలింగ్, మెసేజీ సర్వీసులు అందించే వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలు కూడా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించాలంటే టెలికం లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా యాప్స్ నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. ‘వివిధ ప్లాట్‌ఫాంల ద్వారా కాల్స్ చేయగలిగినప్పుడు అవన్నీ కూడా ఏదో ఒక నియంత్రణ సంస్థ పరిధిలో ఉండాలి. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ఆలోచన ఉంది. టెక్నాలజీ తీసుకొచ్చిన అనేకానేక మార్పుల వల్ల వాయిస్ కాల్, డేటా కాల్ మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది‘ అని వైష్ణవ్ తెలిపారు. యూజర్ల రక్షణని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని బిల్లు రూపొందిందని ఆయన పేర్కొన్నారు. అలాగే యూజర్లు కూడా ఆపరేటర్ల నుంచి సర్వీసులు పొందేందుకు సరైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తప్పుడు వివరాలు ఇస్తే ఏడాది వరకూ జైలు శిక్ష విధించేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఏర్పాటు
న్యూఢిల్లీ: కేంద్ర కమ్యూనికేషన్,టెక్నాలజీ(ఐటీ) శాఖ ను విభజించి కొత్తగా ఎలక్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వలు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన ఈ శాఖ ఆధార్, ఇంటర్నెట్ సర్వీసులను ప్రత్కేకంగా పర్యవేక్షిస్తుంది. దీంతో ఈ రంగానికి సంబంధించి రెండు మంత్రిత్వశాఖలు వేర్వేరుగా పని చేయనున్నాయి. కమ్యూనికేషన్ల శాఖ కింద టెలీకమ్యూనికేషన్, పోస్టల్ డిపార్ట్ మెంటులు పనిచేయనున్నాయి. ఎలక్రానిక్స్, ఇన్ఫరేషన్, టెక్నాలజీ విభాగాలు కొత్త శాఖ కింద పని చేస్తాయి. కొత్తగా ఏర్పడిన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతీ పౌరుని ఆధార్ నంబర్ అనుసంధానం చేయడంపై ప్రత్యేకంగా పని చేయనుంది.