
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కూడా ఈ సామాజికపథకం లబ్దిని పొందొచ్చని తెలిపింది. ఏపీవై ఖాతాదారుల సౌకర్యార్థం ఈ వెసులు బాటును కల్పించినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఏపీవై పథకంలో పంపిణీ ఇప్పటికే ఉన్న చానెల్స్ను బలోపేతం చేయడానికి, కొత్తగా చెల్లింపులు బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులను చేర్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సామాన్యులకు కూడా పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈ సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజన ఫలితం పొందవచ్చని తెలిపింది. దీని ప్రకారం ఆర్‌బీఐ అనుమతి లభించిన పేమెంట్ బ్యాంకులు, ఇతర చిన్న ఫైనాన్స్ సంస్థల ద్వారా ఈ పథకం లబ్దిదారులు పెన్షన్ పొందవచ్చు.
ప్రస్తుతం 11 చెల్లింపు బ్యాంకులు, 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం లభించినట్టు తెలిపింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 2018, జనవరి15న చిన్న బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులతో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక ఓరియంటేషన్ సమావేశంలో ఈ పథకం అమలుపై చర్చించినట్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment