ముంబై : టెలికాం మార్కెట్‌లో సంచనాలను సృష్టిస్తూ దూసుకెళ్తున్న రిలయన్స్ జియో... మరోవైపు సబ్‌స్క్రైబర్ల సంఖ్యలోనూ రికార్డుల మోత మోగిస్తోంది. సంవత్సరం గడిసి మూడు నెలలైన కాలంలోనే రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య 16 కోట్లను తాకింది. వాయిస్, డేటా ఆఫర్స్‌తో రిలయన్స్ జియో మార్కెట్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త ప్లాన్లతో టెల్కోలకు గట్టి పోటీగా నిలుస్తూ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలయన్స్ జియో తాజా సబ్‌స్క్రైబర్ బేస్‌ను ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా నావి ముంబైలో నిర్వహించిన రిలయన్స్ ఫ్యామిలీ డే వేడుకల్లో ఈ విషయాన్ని తెలిపారు.
ఆరు నెలల పాటు ప్రమోషనల్ ఆఫర్‌తో గతేడాది సెప్టెంబర్‌లో టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది రిలయన్స్‌జియో. ఇక అప్పటి నుంచి టెలికాం మార్కెట్‌లో ధరల యుద్ధం ప్రారంభమైంది. మరోవైపు దేశీయ టెలికాం ఆపరేటర్లు భద్రతాపరమైన విషయాల్లో ముఖ్యంగా 5జీ వాతావరణంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ జియో చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యురిటీ ఆఫీసర్ బ్రిజేష్ దత్తా తెలిపారు. ఆధునిక టెక్నాలజీలు సాఫ్ట్‌వేర్ డిఫైన్‌డ్ నెట్‌వర్కింగ్, నెట్‌వర్క్స్ ఫంక్షన్స్ వర్చ్యూలైజేషన్ వంటి వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీస్ రిటైల్, సంస్థ కస్టమర్లకు సెక్యురిటీ పరమైన సర్వీసులు అందజేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment