నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...! | Netflix Tests New Update That Limit Your Password Sharing | Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...!

Published Sat, Mar 13 2021 3:05 PM | Last Updated on Sun, Mar 14 2021 10:09 AM

Netflix Tests New Update That Limit Your Password Sharing - Sakshi

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సరికొత్త ఆప్‌డేట్‌ను తీసుకురాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు 200 మిలియన్ల పైగా సబ్‌స్ర్కైబర్‌ ఉన్నారు. భవిష్యత్తు కాలంలో  నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ డిటెల్స్‌ను  ఇతరులతో పంచుకోలేరు. ఒకవేళ అకౌంట్‌ డిటెల్స్‌ను ఇతరులతో పంచుకున్న , వారికి అకౌంట్‌ ఉన్న వారు కచ్చితంగా అప్రూవ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రసుత్తం కొంతమంది వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తమ అకౌంట్‌ను వాడేవారు తమవారేనా..! అనే సందేశం యాప్‌ ఓపెన్‌ చేయగానే  కనిపించింది. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్‌ను వదిలేసిన, తిరిగి యాప్‌ ఓపెన్‌ చేయగానే ఈ సందేశం కనిపిస్తోంది.

చివరికి అకౌంట్‌ లేనివారు కచ్చితంగా కొత్త అకౌంట్‌ను తీసుకోవాల్సిందే. ఈ ఆప్‌డేట్‌ను  కంపెనీ ప్రస్తుతం టెస్ట్‌ చేస్తోంది. వాణిజ్యపరంగా, భద్రత కారణాల దృష్ట్యా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధి వెల్లడించారు. ఇదిలా ఉండగా నెటిజన్టు ఇకపై అకౌంట్‌ డిటైల్స్‌ను పంచుకోలేముని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: కోహ్లి ట్వీట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంబరం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement