
సాక్షి,ముంబై: ప్రముఖఫుడ్ ఆప్ జొమాటో ఆహార ప్రియులకు,, మద్యం ప్రియులకు వినూత్న ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘జొమాటో గోల్డ్ ’ ప్లాన్‌ను (సబ్ స్క్రిప్షన్ ఆధారిత) ఇండియాలో బుధవారం లాంచ్ చేసింది. ఇనాగరల్ ఆఫర్‌గా అతి తక్కువ ధరకే ఈ సబ్ స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మూడు నెలలకు రూ.299 లకు, 12 నెలలకు రూ.999 తో రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించింది.
మూడు నెలలకు రూ.599, సం.రానికి రూ.1499గా ఉండగా ..భారీ తగ్గింపుతోఈ ఆఫర్లను భారతీయులకు అందిస్తోంది. అంతేకాదు కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత, రోజుకు ప్రతిరోజూ ఉచిత డ్రింక్ పొందవచ్చు, అయితే కనీస బిల్లు రూ.500 ఉండాలి. నెలసరి చందా...ఒక నెలలో అపరిమిత బీరు 4 సార్లు పొందచ్చు. కనీస బిల్లురూ. 999. వీక్లీ ప్లాన్లో వారంలో ఒక రోజుకు అపరిమిత బీరు . కనీస బిల్లు రూ.499.
ఆన్‌లైన్ రెస్టారెంట్ డిస్కవరింగ్ పోర్టల్, ఫుడ్ యాప్ జొమాటో దీని ద్వారా వినియోగదారులకు కాంప్లిమెంటరీ ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందించనుంది. ఇందుకు దాదాపు12వందలకు పైగా అగ్రశ్రేణి రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకంది. సబ్ స్క్రిప్షన్ ఆధారిత సేవలను ఇప్పటికే యూఏఈ, పోర్చుగల్ దేశాల్లో అందిస్తోంది. జొమాటో గోల్డ్ భారతీయులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందనీ, ఇది తమ యూజర్లకు, రెస్టారెంట్లకు భారీ ప్రయోజనాలను కలిగించనుందని జొమాటో ఫౌండర్ అండ్ సీఈవో దీపిందర్ గోయల్ ప్రకటించారు.
ప్రస్తుతం ఢిల్లీ,ముంబై, బెంగళూరులోని రెస్టారెంట్లు, బార్లలో ఈ సేవలను ప్రారంభించింది. మరికొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా ఉన ప్రముఖ నగరాల్లో కూడా ఈ సేవలను విస్తరించున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇప్పటికే 60వేల చందాదారులను జొమాటో కలిగి ఉంది.
