గ్లోబల్–500 కంపెనీల జాబితాలో పటిష్టమైన దేశీ బ్రాండ్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో చోటు దక్కించుకుంది. బ్రాండ్ పటిష్టత సూచీలో 88.9 పాయింట్లతో 17వ ర్యాంకులో నిలి్చంది. 2024 సంవత్సరానికి గాను బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ జాబితాలో ఎల్‌ఐసీ 23వ స్థానంలో, ఎస్‌బీఐ 24వ స్థానంలో నిల్చాయి. గతేడాది (2023) కూడా పటిష్టమైన భారతీయ బ్రాండ్ల జాబితాలో జియో అగ్రస్థానం దక్కించుకుంది. 2024కి సంబంధించిన జాబితాలో వుయ్‌చాట్, యూట్యూబ్, గూగుల్, డెలాయిట్, కోకా కోలా, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు టాప్‌లో ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే కొత్త కంపెనీ అయినప్పటికీ పరిశ్రమలో జియో అత్యంత వేగంగా ఎదిగిందని నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: గూగుల్‌పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే?
కస్టమర్ల సంఖ్య వేగంగా పెరగడం, నవకల్పనలు, బ్రాండ్‌పై సానుకూల అభిప్రాయం మొదలైనవన్నీ కూడా జియో బ్రాండ్ పటిష్టత, ట్రిపుల్ ఏ రేటింగ్‌లో ప్రతిఫలిస్తున్నాయని తెలిపింది. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటర్స్ వంటి దిగ్గజ కంపెనీలున్న టాటా గ్రూప్.. దక్షిణాసియాలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలి్చందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment