
LICacquires6.66pcJFS: లయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయిన ఫైనాన్షియల్ ఎంటిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సంస్థలో 6.66 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ మేరకు ఎల్‌ఐసీ మంగళవారం ప్రకటించింది.
ఇదీ చదవండి:ఎస్‌బీఐ లైఫ్: కస‍్టమర్లకు గుడ్ న్యూస్
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు సోమవారం లిస్టింగ్ తర్వాత దాని తొలి ట్రేడింగ్ సెషన్‌లో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ షేరు ఒక్కో షేరుకు రూ. 265గా లిస్ట్ అయింది. చివరికి 5 శాతం నష్టంతో ముగిసిన సంగతి తెలిసిందే. కంపెనీ విభజన తేదీ అయిన జూలై 20న దాని ఉత్పన్నమైన ధర రూ. 261.85 కంటే 1 శాతానికి పైగా మార్జినల్ ప్రీమియం. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.68 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు వరుసగా రెండో సెషన్‌లో మంగళవారం కూడా జేఎఫ్‌ఎస్ షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Comments
Please login to add a commentAdd a comment