shareholding
-
అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు
LICacquires6.66pcJFS: లయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయిన ఫైనాన్షియల్ ఎంటిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సంస్థలో 6.66 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ మంగళవారం ప్రకటించింది. ఇదీ చదవండి:ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు సోమవారం లిస్టింగ్ తర్వాత దాని తొలి ట్రేడింగ్ సెషన్లో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ షేరు ఒక్కో షేరుకు రూ. 265గా లిస్ట్ అయింది. చివరికి 5 శాతం నష్టంతో ముగిసిన సంగతి తెలిసిందే. కంపెనీ విభజన తేదీ అయిన జూలై 20న దాని ఉత్పన్నమైన ధర రూ. 261.85 కంటే 1 శాతానికి పైగా మార్జినల్ ప్రీమియం. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.68 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు వరుసగా రెండో సెషన్లో మంగళవారం కూడా జేఎఫ్ఎస్ షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. -
ఖరీదైనా.. రెండు గజాలు!
అదొక మెట్రోపాలిటన్ సిటీ. ప్రముఖ వాణిజ్య ప్రాంతం. అక్కడ ప్రాపర్టీ కొనాలంటే కనీసం రూ.20 కోట్లు అయినా ఉండాల్సిందే. కానీ అంత ఖరీదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే ఎగువ మధ్య తరగతి వారి వల్ల కూడా అయ్యే పని కాదు. అయినా సరే ఆ ప్రాపర్టీకి యజమాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఇందుకు ఉన్న మార్గం ఏంటి..? నిజమే అంత భారీ పెట్టుబడి లేకపోవచ్చు. చేతిలో కొద్ది మొత్తమే ఉన్నా, అదే ప్రాపర్టీకి యజమానిగా మారిపోగల అవకాశం ఉంది. అదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. తమకు బాగా నచ్చిన ప్రాపర్టీలో ఒక శాతం వాటాను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాసులను సైతం ప్రాపర్టీ యజమానులను మార్చేదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఈ సాధనం గురించి తెలియజేసే కథనమే ఇది. అసలు ఏంటి ఇది..? పాక్షిక అని పేరులోనే ఉంది. రియల్ ఎస్టేట్‌లో స్వల్ప వాటా. ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి తగ్గ వాటా మీ సొంతం అవుతుంది. అంటే ఒక ప్రాపర్టీకి అచ్చమైన యజమాని కాలేరు. ఆ ప్రాపర్టీకి ఎంతో మంది యజమానుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. ఈక్విటీల గురించి తెలిసే ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ మూలధనంలో ప్రమోటర్ల వాటా గరిష్టంగా 75 శాతమే ఉంటుంది. మిగిలినది పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు. ఒక్క షేరు ధర సుమారు రూ.2,500. కేవలం రూ.2,500 పెట్టి ఒక్క షేరు కొనుగోలు చేసినా ఆ కంపెనీ వాటాదారుగా మారతారు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా ఇదే మాదిరి ఉంటుంది. పాక్షిక రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. స్వల్ప వాటాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన ప్రేరణ టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) చిన్నగా ఉండడమే అని చెప్పుకోవాలి. పైగా కొద్ది మొత్తానికే నాణ్యమైన రియల్ ఎస్టేట్ వాటా వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. ఎలా పనిచేస్తుంది..? సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. మీరు, మీ స్నేహితులతో కలసి 5–10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది అందరికీ సాధ్యం కాదు. అందరి మధ్య సఖ్యత లేదా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ప్రాపర్టీ సంగతేమో కానీ, తమ హక్కుల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే ఈ పాక్షిక రియల్ ఎస్టేట్‌ను సాకారం చేసేందుకు పలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు స్వల్ప పెట్టుబడితో ప్రాపర్టీలో పాక్షిక వాటా కొనుగోలుకు ఇవి అవకాశం కలి్పస్తాయి. ఇలా ఒకరితో ఒకరు పొత్తు లేకపోయినా, అందరూ కలసి ఒక ప్రాపర్టీకి ఉమ్మడి యజమానులుగా మారిపోయేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. ఈ తరహా సేవలు అందించే పోర్టళ్లను ‘ఎఫ్వోపీ’ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. గడిచిన కొన్నేళ్ల కాలంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇన్వెస్టర్ల తరఫున క్లిష్టమైన ప్రాపర్టీ కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర పనులను ఇవి చక్కబెడతాయి. దాంతో కొనుగోలు, విక్రయం ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రాపర్టీ పరిశోధన, కొనుగోలు, అమ్మకం, డాక్యుమెంటేషన్, న్యాయపరమైన అంశాలు, అద్దె వసూలు, ఆ అద్దెను యజమానులకు పంపిణీ చేయడం తదితర సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తాయి. వీటి సాయం లేకుండా ఇన్వెస్టర్లు ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ సొంతంగా నిర్వహించుకోవడం సులభం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ..? దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాలకు సంబంధించి ఫ్రాక్షనల్ ప్రాపర్టీ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గచ్చి»ౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ప్రాపర్టీ ఆఫర్ విలువ రూ.46,60,00,000. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్/ఐఆర్ఆర్ (యాజమాన్య నిర్వహణ సమయంలో అంతర్గత రాబడి రేటు) 13.5 శాతంగా ఉంది. స్థూల ఈల్డ్ (వార్షిక అద్దె రాబడి) 8.9 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలోని గోరేగావ్‌లో (ఈజోన్ అపార్చునిటీ) రూ.33,60,00,000 విలువ చేసే ప్రాపర్టీకి సంబంధించి డీల్‌లో.. ఐఆర్ఆర్ 13.4 శాతంగా ఉంటే, గ్రాస్ ఎంట్రీ ఈల్డ్ 9.6 శాతంగా ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 శాతానికి పైన ఐఆర్ఆర్ ఉంటే దాన్ని మెరుగైనదిగా పరిగణిస్తారు. 18–20 శాతంగా ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. ఐఆర్ఆర్ 5% కంటే తక్కువ ఉంటే అది లాభసాటి కాదు. నిర్వహణ సులభతరం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న సౌలభ్యం నిర్వహణ అని చెప్పుకోవాలి. అద్దె వసూలు, ప్రాపర్టీ నిర్మాణం, విక్రయం, పన్నుల చెల్లింపుల ఇవన్నీ ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌లే చూస్తాయి. దీంతో ఇన్వెస్టర్‌పై నిర్వహణ భారం పడదు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు పట్టుకుని ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడదు. సెబీ నియంత్రణ లేదు గత కొన్నేళ్లలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల లావాదేవీల పరంగా ఓ ప్రామాణిక విధానం, ప్రక్రియ, మార్గదర్శకాలు, నియంత్రణలు అంటూ లేవు. ఇన్వెస్టర్లకు సమగ్రంగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాయా? లావాదేవీల నిర్వహణ చట్టబద్ధంగానే ఉందా? అని చూసే వారు లేరు. అందుకే ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మార్కెట్లో లావాదేవీలకు రక్షణలు ఏర్పడతాయి. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రయోజనాలకు భరోసా ఉంటుంది. అయితే ఇందుకు ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎలాంటి ప్రాపర్టీలు..? ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో అధిక శాతం లావాదేవీలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పైగా పెట్టుబడి వృద్ధికి తోడు, వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ రూపంలో ఆదాయం క్రమం తప్పకుండా వస్తుండడం మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందుకే వాణిజ్య ప్రాపర్టీల ధరలు చాలా ఖరీదుగా ఉంటాయి. వీటి విలువ సాధారణంగా రూ.20 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుంది. అందుకే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా వాణిజ్య ప్రాపర్టీల్లో రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో కనీసంగా ఒక టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) విలువ రూ.10–25 లక్షల మధ్య ఉంటుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రాపర్టీ వారీగా రాబడి రేటు, ధర తదితర వివరాలు అన్నీ ఉంటాయి. లిక్విడిటీ మాటేమిటి? రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రధాన సమస్య లిక్విడిటీయే. అవసరం వచ్చినప్పుడు విక్రయిద్దామంటే ఎక్కువ సందర్భాల్లో వెంటనే సాధ్యపడదు. విక్రయించే ప్రాపర్టీ, దాని ధర ఇతర అంశాలన్నింటినీ కొనుగోలుదారులు లోతుగా చూస్తారు. బేరసారాలు, విచారణలు అన్నీ అంగీకారం అయితేనే ప్రాపర్టీ లావాదేవీ పూర్తవుతుంది. కనుక కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం సహజంగా రియలీ్టలో తక్కువ. మీరు ఆశించే ధరకే విక్రయించాలని అనుకుంటే నెలల నుంచి సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లోనూ ఇదే అమలవుతుంది. కాకపోతే విడిగా ఓ ప్రాపర్టీ లావాదేవీతో పోలిస్తే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ టికెట్ సైజు తక్కువగా ఉంటుంది. కనుక లిక్విడిటీ కాస్తంత మెరుగు అని భావించొచ్చు. పాక్షిక ప్రాపర్టీ అయినా సరే, దాని అద్దె రాబడి ఏ మేరకు? ప్రాపర్టీ నాణ్యత మాటేమిటి? అనేది కొనుగోలు దారులు చూస్తారు. నాణ్యమైన ప్రాపర్టీ, అద్దె రాబడి మెరుగ్గా ఉంటే వేగంగా అమ్ముడుపోతుంది. లేదంటే చాలా కాలం పాటు అందులో పెట్టుబడి చిక్కుకుపోవచ్చు. పైగా ఇందులో కొనుగోలు చేసే ప్రాపర్టీ పెట్టుబడి దృష్ట్యానే తప్ప వినియోగం కోణంలో ఉండదు. అందుకని విక్రయించుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. టికెట్ సైజు తక్కువగా ఉండడం ఇందులో కాస్త అనుకూలతగా చెప్పుకోవచ్చు. -
దివిస్‌లో 5 శాతం దాటిన ఎల్ఐసీ వాటా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబరేటరీస్‌లో జీవిత బీమా దిగ్గజమైన ఎల్ఐసీ తన వాటాలను పెంచుకుంది. రూ.35.82 కోట్లు పెట్టి అదనపు వాటాలను కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు రూ.3,379 వెచ్చించింది. దీంతో దివిస్ ల్యాబ్‌లో ఎల్ఐసీ వాటాలు 1,32,54,663 నుంచి 1,33,60,663కు పెరిగాయి. నవంబర్ 7న తన వాటా 5 శాతాన్ని మించినట్టు ఎల్ఐసీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. లిస్టెడ్ కంపెనీలో ఏదైనా కంపెనీకి వాటా 5 శాతం దాటితే దాన్ని ప్రత్యేకంగా తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఫార్మా ఇంటర్ మీడియట్స్, ఏపీఐలు, న్యూట్రాస్యూటికల్స్‌లో దివిస్ దిగ్గజ సంస్థ కావడం గమనార్హం. బుధవారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు రూ.631 వద్ద ముగియగా, దివిస్ ల్యాబ్ 3.38 శాతం నష్టపోయి రూ.3,298 వద్ద ముగిసింది. -
టీటీకే ప్రెస్టీజ్ చేతికి అల్ట్రాఫ్రెష్, ఇక ఆ సేవలు కూడా
న్యూఢిల్లీ: అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ సొల్యూషన్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు కిచెన్ అప్లయెన్సెస్ దిగ్గజం టీటీకే ప్రెస్టీజ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం 40 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు వీలుగా రూ. 20 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. తదుపరి మరో రూ. 10 కోట్లు వెచ్చించడం ద్వారా 51 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు టీటీకే ప్రెస్టీజ్ ఎండీ చంద్రు కల్రో తెలియజేశారు. దీంతో వేగవంత వృద్ధిలో ఉన్న మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో ప్రవేశించేందుకు కంపెనీకి వీలు చిక్కనుంది. మొత్తం కిచెన్ సొల్యూషన్స్ అందించే కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా తాజా కొనుగోలుని చేపట్టినట్లు కంపెనీ చైర్మన్ టీటీ జగన్నాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాడ్యులర్ కిచెన్ మార్కెట్ విలువ రూ. 9,500 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు. దీనిలో 25 శాతమే బ్రాండెడ్ విభాగం ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. మాడ్యులర్ కిచెన్‌లోకి అల్ట్రాఫ్రెష్ కొనుగోలు ద్వారా మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ విభాగంలో అడుగు పెట్టనున్నట్లు చంద్రు తెలియజేశారు. కంపెనీ బిజినెస్‌కు ఇది అదనపు ప్రయోజనాలను కల్పిస్తుందని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్షిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో రూ. 1,000 కోట్లు ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా ఆశిస్తున్నట్లు తెలియజేశారు. తాజా కొనుగోలు దీనిలో భాగమేనని వివరించారు. ప్రస్తుత నాయకత్వంలోనే స్వతంత్ర కంపెనీగా అల్ట్రాఫ్రెష్ మాడ్యులర్ కొనసాగనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ప్రెస్టీజ్ బ్రాండును వినియోగించుకుంటుందని తెలియజేశారు. రానున్న ఐదేళ్లలో రూ. 23,000 కోట్ల టర్నోవర్‌ను సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం అల్ట్రాఫ్రెష్ 120 స్టూడియోలతో దేశవ్యాప్తంగా 5,000 కిచెన్లను తయారు చేసినట్లు తెలియజేశారు. -
చోళమండలం ఇన్వెస్ట్ గూటికి పేస్విఫ్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ పేమెంట్ సొల్యూషన్స్ అందించే పేస్విఫ్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్ల చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ తాజాగా వెల్లడించింది. రూ. 450 కోట్లను వెచ్చించడం ద్వారా 72.12% వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలు తదుపరి పేస్విఫ్‌ను అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. షేరుకి రూ. 1,622.66 ధరలో నగదు ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా మెజారిటీ వాటాను చేజిక్కించుకోనున్నట్లు వివరించింది. బ్యాక్‌గ్రౌండ్ ఇలా: 2013లో ప్రారంభమైన పేస్విఫ్ ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే సర్వీసులు అందిస్తోంది. ప్రధానంగా ఈకామర్స్ బిజినెస్‌లకు సేవ లు సమకూర్చుతోంది. ఈకామర్స్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. బిజినెస్ యజమానులు కస్టమర్ల నుంచి చెల్లింపులను ఆమోదించేందుకు వీలుగా ఓమ్నీచానల్ పేమెంట్ లావాదేవీల సొల్యూషన్స్ సమకూర్చుతోంది. స్టోర్లలో, హోమ్డెలివరీ (ఇంటివద్ద), ఆన్లైన్, ఎంపీవోఎస్, పీవోఎస్ తదితరాల ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు వీలు కల్పిస్తోంది. మొత్తం రుణ మంజూరీ విధానంలో ఆధునిక మార్పులు, విస్తరణలకుగాను కంపెనీ అమలు చేస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా తాజా కొనుగోలుకి తెరతీసినట్లు చోళమండలం ఇన్వెస్ట్ పేర్కొంది. ప్రధానంగా ఎస్ఎంఈ విభాగం రుణాల మంజూరీలో ఎకో సిస్టమ్‌ను అమలు చేసేందుకు ఇది తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. -
షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (ఎస్సీఐ) ప్రభుత్వ వాటా కొనుగోలుకు శక్తి కలిగిన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ (ఎంఈఐఎల్) నిలిచింది. ఎంఈఐఎల్‌తోపాటు యూఎస్‌కు చెందిన సేఫ్సీ, ఎన్నారై రవి మెహరోత్రా నేతృత్వంలోని కన్సార్షియం షార్ట్ లిస్ట్ అయిన జాబితాలో ఉన్నాయి. ఎస్‌సీఐలో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన ఈ మూడు కంపెనీలు టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రమాణాల విషయంలో అర్హత సాధించాయి. షిప్పింగ్ కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 63.75% వాటాను విక్రయిస్తోంది. ఈ వాటాను దక్కించుకున్న సంస్థ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం ఆ తర్వాత మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. 1961 అక్టోబరు 2న ఏర్పాటైన ఎస్సీఐ.. భారత్‌లో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా ఎదిగింది. సరుకు, ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పెద్ద ఎత్తున బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ప్రొడక్ట్ ట్యాంకర్స్, కంటైనర్ వెసెల్స్, ప్యాసింజర్/కార్గో వెసెల్స్, ఎల్పీజీ, అమోనియా క్యారియర్లను సొంతంగా కలిగి ఉంది. డిసెంబరు త్రైమాసికంలో షిప్పింగ్ కార్పొరేషన్ రూ.841 కోట్ల టర్నోవర్‌పై రూ.103 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.43 % ఎగసి రూ.115.75 వద్ద స్థిరపడింది. -
ముకేశ్.. మారథాన్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ నిధుల వేటలో దూసుకుపోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లోకి మరో భారీ పెట్టుబడి వచ్చిచేరింది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తమ సంస్థలో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, దీనిద్వారా రూ.9,555 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆర్ఆర్వీఎల్ గురువారం ప్రకటించింది. తాజా పెట్టుబడుల సమీకరణతో రిలయన్స్ రిటైల్ విభాగం విలువ దాదాపు రూ.4.587 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. కాగా, గడిచిన రెండు నెలల్లో (సెప్టెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ) ఆర్‌ఆర్‌వీఎల్‌లోకి మొత్తం రూ.46,265 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. కంపెనీలో 10.52 శాతం వాటాను ఎనిమిది మంది ఇన్వెస్టర్లకు విక్రయించింది. జియోలోనూ పెట్టుబడి... సౌదీ పీఐఎఫ్‌కు రిలయన్స్ గ్రూప్‌పై గురి బాగానే కుదిరింది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం రూ.11,367 కోట్లను కుమ్మరించింది. తాజాగా రిటైల్లోనూ అడుగుపెట్టడం ద్వారా అంబానీ కంపెనీల్లో పీఐఎఫ్‌కు ఇది రెండో పెట్టుబడి కానుంది. కాగా, జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఫేస్బుక్, ఇంటెల్, గూగుల్ సహా మొత్తం 13 అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు వాటా విక్రయం ద్వారా రూ.1.52 లక్షల కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఐదేళ్లలోపు ఆయా విభాగాలను పబ్లిక్ ఇష్యూతో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలనేది రిలయన్స్ ప్రణాళిక. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లను మించిపోగా, ఇందులో రిటైల్, జియోల విలువ రూ.9 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ధనాధన్ రిటైల్... ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్‌కు వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 12,000 పైగా స్టోర్స్ ఉన్నాయి. కరోనా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.39,199 కోట్ల ఆదాయాన్ని రూ. 2,099 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. సమీకరిస్తున్న ఈ భారీ నిధులతో రిలయన్స్ రిటైల్ అటు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీలతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న పలు ఆన్లైన్ ఫార్మాట్లకు తోడు కిరాణా సరుకుల అమ్మకాలకు ప్రత్యేకంగా జియోమార్ట్‌ను ప్రారంభించడం తెలిసిందే. సౌదీ అరేబియాతో మాకు(రిలయన్స్) దీర్ఘాకాలికంగా మంచి సంబంధాలు ఉన్నాయి. సౌదీ ఆర్థిక పురోభివృద్ధిలో పీఐఎఫ్ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. రిలయన్స్ రిటైల్‌లోకి ఒక విలువైన భాగస్వామిగా పీఐఎఫ్‌ను ఆహ్వానిస్తున్నాను. ఈ సంస్థ అందించే మద్దతు, మార్గదర్శకత్వాన్ని కూడా ఉపయోగించుకొని 130 కోట్ల మంది భారతీయులు, అలాగే లక్షలాది మంది చిన్న వర్తకుల జీవితాలను మెరుగుపరచడం కోసం భారత్ రిటైల్ రంగాన్ని సమూలంగా మార్చివేసేందుకు మా ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని కొనసాగిస్తాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత -
రిలయన్స్ రూ.51 వేల కోట్ల షేర్ల బదిలీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రమోటర్ల కంపెనీల్లో షేర్ హోల్డింగ్ పునరవ్యవస్థీకరణలో భాగంగా బీఎస్ఈలో రూ.51,000 కోట్ల విలువైన సుమారు 39 కోట్ల షేర్లు చేతులు మారాయి. ప్రమోటర్ల కంపెనీల్లో నాలుగు కంపెనీలు 39.6 కోట్ల షేర్లను మరో రెండు కంపెనీల్లోకి బదిలీ చేశాయి. ఆదిశేష్ ఎంటర్ప్రైజెస్, త్రిలోకేశ్ కమర్షియల్స్, అభయప్రద ఎంటర్ప్రైజెస్, తరన్ ఎంటర్ప్రైజెస్...ఈ నాలుగు కంపెనీలు 12.21 శాతం వాటాకు సమానమైన 39.6 కోట్ల షేర్లను దేవరుషి కమర్షియల్స్, తత్వం ఎంటర్‌ప్రైజెస్‌కు బదలాయించాయి. ఒక్కో షేర్ సగటు ధర రూ.1,284 చొప్పున ఈ డీల్ విలువ రూ.50,859 కోట్లు. ఇది అంతర్గత బదిలీ అయినందున మొత్తం ప్రమోటర్ల షేర్ హోల్డింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ బదిలీ నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.3 శాతం తగ్గి రూ.1,287 వద్ద ముగిసింది. ప్రమోటర్ గ్రూప్‌లోని 15 సంస్థలు 118.99 కోట్ల షేర్లను ఇదే గ్రూప్‌లోని మరో 8 సంస్థల్లోకి బదిలీ చేయనున్నాయని ఈ నెల 2న రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్, అనంత్, ఇషాలను కూడా కలుపుకొని మొత్తం 63 ప్రమోటర్ గ్రూపులున్నాయి. ఈ ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు ఆర్ఐఎల్లో 45.24 శాతం వాటా (146.39 కోట్ల షేర్లు) ఉంది. ముకేశ్ అంబానీకి ఆర్ఐఎల్లో నేరుగా 36.15 లక్షల షేర్లు, నీతా అంబానీకి 33.98 లక్షలు, ఆకాశ్, ఇషాలకు చెరో 33.63 లక్షలు, అనంత్‌కు లక్ష చొప్పున షేర్లు ఉన్నాయి.