న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబరేటరీస్‌లో జీవిత బీమా దిగ్గజమైన ఎల్‌ఐసీ తన వాటాలను పెంచుకుంది. రూ.35.82 కోట్లు పెట్టి అదనపు వాటాలను కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు రూ.3,379 వెచ్చించింది. దీంతో దివిస్ ల్యాబ్‌లో ఎల్‌ఐసీ వాటాలు 1,32,54,663 నుంచి 1,33,60,663కు పెరిగాయి.
నవంబర్ 7న తన వాటా 5 శాతాన్ని మించినట్టు ఎల్‌ఐసీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. లిస్టెడ్ కంపెనీలో ఏదైనా కంపెనీకి వాటా 5 శాతం దాటితే దాన్ని ప్రత్యేకంగా తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఫార్మా ఇంటర్ మీడియట్స్, ఏపీఐలు, న్యూట్రాస్యూటికల్స్‌లో దివిస్ దిగ్గజ సంస్థ కావడం గమనార్హం. బుధవారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు రూ.631 వద్ద ముగియగా, దివిస్ ల్యాబ్ 3.38 శాతం నష్టపోయి రూ.3,298 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment