రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్షియల్ లిమిటెడ్(జేఎఫ్‌ఎల్) త్వరలో హోమ్‌లోన్ సర్వీసులను విస్తరిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈమేరకు కంపెనీ తన లోన్ల వివరాలు వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కంపెనీ తన ‘జియో ఫైనాన్స్ యాప్ బీటా మోడ్’ వినియోగదారులకు హోమ్‌లోన్లు అందిస్తోంది.
గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. అనంతరం జియో ఫైనాన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా యూపీఐ సర్వీసులు, ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు, బీమా సేవలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా సర్వీసు అందిస్తోంది. జేఎఫ్‌ఎల్ యాప్ బీటా మోడ్ వినియోగదారులకు హోమ్‌లోన్లు అందిస్తున్నారు. ఈ సర్వీసును త్వరలో కంపెనీ వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మార్కెట్‌లో వస్తున్న వార్తల ప్రకారం కంపెనీ ఈ సర్వీసును తీసుకొస్తే ఇదే రంగంలో సేవలందించే ఇతర హోమ్‌లోన్ కంపెనీలు, కొన్ని బ్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మే 30, 2024న ప్రారంభమైన జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ యాప్ ఇప్పటికే 10 లక్షల డౌన్‌లోడ్‌లను అధిగమించిందని కంపెనీ తెలిపింది. జులై 2023లో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందుకోసం ఇరు కంపెనీలు రూ.1,258 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment