దేశీయస్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలోనే భారీ నష్టాలతో ఉన్నప్పటికీ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగింపులో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 65,401.92 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 19,434 వద్ద ముగిసాయి. దాదాపు 1509 షేర్లు పురోగమించగా, 2101 షేర్లు క్షీణించాయి.
నిఫ్టీలో ఎల్‌టిఐఎండ్‌ట్రీ, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యుఎల్, రిలయన్స్ ప్రధానంగా లాభాలను ఆర్జించగా, నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి.
ఐటీ, ఎఫ్‌ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం నష్టపోయాయి. పవర్, రియాల్టీ , సీఎస్‌యు బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి.
అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం నష్టపోయింది. శుక్రవారం నాటి 82.85 ముగింపుతోపోలిస్తే 82.95 వద్ద ముగిసింది.బలహీన దేశీయ మార్కెట్లు బలమైన డాలర్ కారణంగా భారత రూపాయి తాజా 10 నెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనమైన ఐఐపీ గ్రోత్ కూడా ప్రభావం చూపింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment