లాభాల స్వీకరణ: నష్టాల్లో మార్కెట్లు
Published Tue, Mar 7 2017 4:28 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
ముంబై : ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ఓటింగ్ కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48.63 పాయింట్ల నష్టంలో 28999.56 వద్ద, నిఫ్టీ 16.55 పాయింట్ల నష్టంలో 8946.90 వద్ద క్లోజ్ అయ్యాయి. బుల్లిష్ జోరుతో గరిష్టాల్లో నమోదైన దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఎక్కువగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో రెండేళ్ల గరిష్టంలో ఎగిసిన మార్కెట్లు కిందకి దిగజారాయి.
మరోవైపు ఈ వారం చివర్లో రానున్న ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎగ్జిట్ పోల్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంచనావేసిన దానికంటే మెరుగైన మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాలు, దేశీయ కంపెనీల ఆదాయాలు, సపోర్టింగ్ గా వచ్చిన బడ్జెట్, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చే సానుకూలాంశాలు ఇటీవల దలాల్ స్ట్రీట్ లో సెంటిమెంట్ ను బలపర్చాయని విశ్లేషకులు చెప్పారు. వచ్చే వారంలో విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్ పై కూడా ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని కూడా విశ్లేషకులు చెప్పారు. ఎక్కువగా మెటల్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ, కొన్ని బ్యాంకింగ్, రియాల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదేసమయంలో ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
Advertisement
Advertisement