సాక్షి,ముంబై: ఫెడ్ బూస్ట్‌తో లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా నష్టాల్లోకి జారుక్నున్నాయి. అత్యధిక స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ దిగడంతో ఆరంభ లాభాలన్నీ ఆవి రైపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ సెంచరీకి పైగా లాభాలతో 38,500ను అధిగమించిన సెన్సెక్స్ ప్రస్తుతం 78 పాయింట్లు నష్టపోయి 38308వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లు నష్టపోయి 11501 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు 30వేల స్థాయి వద్ద ఆల్ టైం హైని టచ్ చేసింది. దీంతో బ్యాంకింగ్ సెక్టార్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అయితే నిఫ్టీ11500 స్థాయిని నిలదొక్కుకోవడం విశేషం.
రియల్టీ తప్ప దాదాపు అన్ని రంగాలూ నష‍్టపోతున్నాయి. ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటన్, యస్ బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఐషర్, హిందాల్కో, పవర్‌గ్రిడ్ టాప్ విన్నర్స్‌గా ఉండగా, హెచ్‌పీసీఎల్, ఇన్‌ఫ్రాటెల్, బీపీసీఎల్, జీ, ఆర్‌ఐఎల్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 3.5 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ప్రెస్టేజ్, శోభా, సన్‌టెక్ 1-0.6 శాతం మధ్య లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment