ప్రాఫిట్ బుకింగ్: మార్కెట్లు డౌన్
Published Wed, May 17 2017 9:39 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
ముంబై : రికార్డుల మోతమోగించిన స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బుధవారం ట్రేడింగ్ లో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంలో 30,590 వద్ద, నిఫ్టీ 8.20 పాయింట్ల నష్టంలో 9504 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్స్, బ్యాంకులు, ఆటో, ఫార్మా సూచీలు నష్టాలు గడిస్తుండగా.. మెటల్స్ పైకి ఎగిశాయి. స్ట్రాంగ్ క్యూ4 లాభాలు నమోదుచేయడంతో ట్రేడింగ్ ప్రారంభంలో టాటా స్టీల్ 3 శాతానికి పైగా లాభాలార్జించింది. టాటా స్టీల్ తో పాటు టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు పండించాయి. ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, జీ ఎంటర్ టైన్మెంట్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 63.99 వద్ద ప్రారంభమైంది. 2017 ఏప్రిల్ 27 తర్వాత ఇదే అతిపెద్ద స్థాయి. మిశ్రమమైన ఎకనామిక్ డేటా, రిటైల్ ఆదాయాలతో అమెరికా మార్కెట్లు ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. టెక్నాలజీ స్టాక్స్ మద్దతుతో నాస్ డాక్ రికార్డు క్లోజింగ్ లో నమోదైంది. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 122 రూపాయలు లాభపడి 28,114 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement
Advertisement