సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో సంక్రాంతి శోభ ముందే రావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. కీలక సూచీలు మంగళవారం జీవిత కాల గరిష్టాలను నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 263 పాయింట్ల కుప్పకూలగా, నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించింది. దీంతో సెన్సెక్స్ 41800 స్థాయిని , నిఫ్టీ 12300 స్థాయిని కూడా కోల్పోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్‌బుకింగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మలో అమ్మకాలు కొనసాగుతుండగా, మెటల్ , పెయింటింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి.
ఇండస్ ఇండ్, విప్రో, డా.రెడ్డీస్, ఎస్‌బీఐ, బీపీసీఎల్, అల్ట్రా టెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిం నష్టపోతున్నాయి. హీరో మోటో, టైటన్, ఎం అండ్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, మారుతి సుజుకి స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment