సాక్షి, ముంబై: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. జూలై ఎఫ్‌అండ్ఓ సిరీస్ రేపటితో ముగియనున్న సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 99పాయింట్ల నష్టంతో 37912వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 11157 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అమెరికా ఫెడ్ నిర్ణయాలవైపు చూస్తున్న కారణంగా అప్రమత్తత కొనసాగుతోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. రిలయన్స్, నెస్లే, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, అదాని పోర్ట్స్, టీసీఎస్, మారుతి, హీరో మోటో, టెక్ మహీంద్ర నష్టపోతున్నాయి. గ్రాసీం, భారతీ ఇన్‌ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment