ప్రాఫిట్ బుకింగ్: మార్కెట్లు ఢమాల్
Published Fri, May 5 2017 4:03 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
లాభాల జోరుతో పరుగులు పెట్టిన నిన్నటి మార్కెట్లు, శుక్రవారం సతికిలపడ్డాయి. లాభాల స్వీకరణతో మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 267.41 పాయింట్లు కిందకి పడిపోయి, 30వేల కిందకు దిగజారింది. 29,850.80 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 74.60 పాయింట్ల నష్టంలో 9285.30 వద్దకు పడిపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నెగిటివ్ గా ట్రేడయ్యే సరికి, దేశీయ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంక్స్, ఆయిల్, మెటల్స్ స్టాక్స్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
దీంతో శుక్రవారం మార్కెట్లు ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. నేటి ట్రేడింగ్ లో ఎస్బీఐ, అరబిందో ఫార్మా, ఏసియన్ పేయింట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలువగా... టాటా మోటార్స్, ఓన్జీసీ, హిందాల్కోలు నష్టాలు గడించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలహీనపడి 64.36 గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 157 రూపాయల లాభంలో 28,229గా ట్రేడయ్యాయి.
Advertisement
Advertisement