సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య మార్కెట్లు ఊగిసలాడాయి. పెట్టుబడిదారులు లాభాలను రికార్డు స్థాయిలో లాభాలను స్వీకరించడంతో సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకుపై పతనమై 51వేల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 15వేలకు దిగువకు పతనమైంది. కానీ కనిష్ట స్థాయిల్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. తద్వారా కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడం విశేషం. చివరకు సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 51300 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 15106 వద్ద పటిష‍్టంగా ముగిసాయి. స్థిరపడ్డాయి. టాటా స్టీల్ బిగ్గెస్ట్ గెయినర్‌గా నిలవగా ఐషర్ మోటార్స్‌టాప్ లూజర్‌గా నిలిచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, గెయిల్ లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాలతో ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment