
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ సుమారు 400పాయింట్లకు పైగా ఎగియగా, 10800 పైనే నిఫ్టీ ఉత్సాహంగా కదలాడింది. అయితే డెరివేటివ్ సిరీస్ ముగియనున్న నేపథ్యంలో మిడ్ సెషన్ తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 35,906 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభానికి పరిమితమై 10806వద్ద కొనసాగుతోంది.
అయితే అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రధానంగా ఐటి, ఎఫ్ఎంసిజి, ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ రంగ కౌంటర్లు లాభపడుతున్నాయి. మెటల్, ఫార్మా, పిఎస్‌యూ బ్యాంక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. వేదాంతా, సన్‌ఫార్మ, టీసీఎస్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. అటు క్రూడ్ భారీగా పెరగడంతో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం షేర్లు నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment