
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంనుంచీ అమ్మకాల ఒత్తిడినిఎదుర్కొంటున్న కీలక సూచీలు మిడ్ సెషన్‌నుంచి మరింత పతన మైనాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల లాభాల స్వీకరణతో ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమై 40731 వద్ద,నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 12035 వద్ద ట్రేడవుతున్నాయి. తద్వారా వారాంతంలో సెన్సెక్స్ 41 వేల స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 12050 స్థాయి దిగువకు చేరింది. సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణకు తోడు కేంద్రం సెప్టెంబర్ త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేయనుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, హిందూస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో షేర్లు నష్టపోతుండగా, యస్‌బ్యాంక్, ఎన్‌టీపీసీ, భారతీఎయిర్‌టెల్, అదానీపోర్ట్స్, ఇన్ఫ్రాటెల్ షేర్లు లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment