ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్ లోముగిశాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతో 29,518 వద్ద , నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 9,126 వద్ద ముగిసింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,150 స్థాయి దిగువన ముగియడం విశేషం.గతవారం రికార్డ్ స్థాయిలను నమోదు చేసిన మార్కెట్లలో మదుపర్ల లాభాల స్వీకరణ కొనసాగింది. దీంతో గత మూడు సెషన్లుగా వరుసగా పాజిటివ్‌గా ముగిసిన మార్కెట్లు మొదటిసారి నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ టెలికాం, బ్యాంకింగ్ సెక్టార్ నష్టాలను చవిచూసింది. ప్రధానంగా ఐడియా 14శాతానికిపై గాఎగిసిన ఐడియా చివరలో 14 శాతానిపైగా నష్టపోయింది.
ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో లాంటి లార్జ్ క్యాఫ ఐటి స్టాక్స్ నష్టపోయాయి. అయితే యాంటి డంపింగ్ డ్యూటీ పై వాణిజ్య మంత్రి మార్చి 28 న సమావేశం నిర్వహించనున్నారనే వార్తల నేపథ్యంలో టైర్ షేర్లన్నీ 1నుంచి 3శాతం ఎగిశాయి. ఏంఆర్ఎఫ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, టీవీఎస్ శ్రీచక్ర, సియల్, అపోలో టైర్స్ గుడ్ ఇయర్ ఇండియా జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. అరబిందో, గ్రాసిమ్, భెల్, ఐషర్, కోల్ ఇండియా లాభపడగా, 1:1 బోనస్ ప్రకటించడంతో వాపోలీ మెడికేర్ కూడా భారీగా లాభపడింది.
అయితే జీఎస్‌టీ లోని కీలకమైన నాలుగు చట్టాలకు క్యాబినెట్ ఆమోదం లభించడంతో దేశంలో రానున్న ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ గా ఉండదనుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.