ముంబై : కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నా పదిగ్రాముల పసిడి ఇంకా 47,000కు పైగానే పలుకుతోంది. ఇండో-చైనా ఉద్రిక్తతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరగడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధరలు నిలకడగానే ఉన్నా ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో దేశీ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి.ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 439 రూపాయలు తగ్గి 47,128 రూపాయలకు దిగివచ్చింది. ఇక కిలో వెండి 230 రూపాయలు పతనమై 48,100 రూపాయలు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment