ముంబై : బంగారం ధరలు సోమవారం వరుసగా నాలుగో రోజూ తగ్గుముఖం పట్టాయి. రూపాయి బలోపేతం కావడంతో పాటు అధిక ధరల వద్ద లాభాల స్వీకరణతో పసిడి ధరలు దిగివచ్చాయి. గత బుధవారం రికార్డుస్ధాయిలో 10 గ్రాముల బంగారం 48,982 రూపాయలు పలుకగా వరుసగా నాలుగు రోజుల్లో తులం బంగారం ఏకంగా 1000 రూపాయలు దిగివచ్చింది. సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి 0.34 శాతం తగ్గి 47,882 రూపాయలకు పడిపోయింది. కిలో వెండి 0.36 శాతం పతనమై 49,000 రూపాయలకు తగ్గింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్ ధర 1772 డాలర్లకు దిగివచ్చింది. కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటం, అంతర్జాతీయ అనిశ్చితి పరిణామాలతో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : బడా బాబు మాస్క్ ఖరీదు రూ.2.89 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment