సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరసగా ఏడవ సెషన్ లో లాభాల బాటలో వుంది. ఆరంభంలో తడబడినా వెంటనే పుంజుకుని సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 34291 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు లాభంతో 10119 వద్ద ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోను కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. అరబిందో ఫార్మా, టాటా మోటార్స్,ఎస్ బీఐ, వేదాంతా ఇండిగో లాభపడుతుండగా, ఇండస్ ఇండ్, యాక్సిస్, హెచ్డీఎఫ్ సీ బ్యాంకు తదితర షేర్లలో లాభాల స్వీకరణ నెలకొంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 114 పాయింట్లు కోల్పోయి 33998 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 10036 వద్ద కొనసాగుతుండటం గమనార్హం.
చదవండి : అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment