సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచమార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఆర్థిక సర్వే వ్యాఖ్యల నేపథ్యంలో కీలక సూచీలు రికార్డ్ స్థాయిల నుంచి వెనక్కి మళ్లాయి. భారీగా అమ్మకాల ఒత్తిడితో ట్రేడింగ్‌ను ఆరంభించిన మార్కెట్లలో చివరి వరకూ అదే ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 36,034 వద్ద నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 11,050 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ ప్రధానంగా నష్టపోయాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1 న రానున్న యూనియన్ బడ్జెట్ నేపథ్యంలో పెట్టుబడిదారులు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్టు విశ్లేషకులు తెలిపారు.
ఐషర్, కొటక్ బ్యాంక్, ఇన్‌ఫ్రాటెల్, బాష్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, హిందాల్కో, యాక్సిస్ నష్టాల్లోనూ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్, హీరో మోటో, కోల్ ఇండియా, భారతీ, సన్ ఫార్మా, ఎస్‌బీఐ లాభాల్లోనూ ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment