
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బడ్జెట్ రోజు నిన్న (బుధవారం) ఒడిదుడుకులకు లోనైన సూచీలు గురువారం ఆరంభంలో సెన్సెక్స్ ఏకంగా 475 పాయింట్లు కుప్పకూలింది. మిడ్ సెషన్‌లో పుంజుకున్నాయి. అయితే అదానీ గ్రూపు వరుస నష్టాల మార్కెట్‌ను వెనక్కి లాగాయి. ఫలితంగా సెన్సెక్స్ 224 పాయింట్లు ఎగిసి 59932 వద్ద, 6 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 16600 స్థాయిని నిలబెట్టుకుంది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి.
ముఖ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ ప్రకటన తర్వాత గ్రూపు షేర్లు మరింత పతనమైనాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏకంగా 27 శాతం, అదానీ పోర్ట్స్ 7 శాతం కుప్పకూలింది. ఐటీసీ, బ్రిటానియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గానూ అదానీ గ్రూపు షేర్లతో పాటు,యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో ఆరంభ లాభాలను కోల్పోయి తిరిగి 82 స్థాయికి పడి పోయింది.
Comments
Please login to add a commentAdd a comment