
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఇన్వెస‍్టర్ల లాభాల స్వీకరణతో నిన్న వెనక్కి తగ్గిన సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో తో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఆరంభంలోనే తీవ్ర ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ నష్టాలనుంచి లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్ ఒక్కసారిగా 105 పాయింట్లు ఎగిసి 39084 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11741 వద్ద ట్రేడ్ అవుతుంది.
రేపు (గురువారం) 2019 ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హువావేపై ఆంక్షలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా సడలించడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి.
డీహెచ్‌ఎఫ్‌ఎల్ 14 శాతం కుప్పకూలి టాప్ లూజర్‌గా ఉంది. ఐటీసీ, బ్లూ డార్ట్, ఐషర్ టాప్ విన్సర్న్‌గా ఉన్నాయి. మారుతి, టాటామోటార్స్ నష్టాలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment